సమంత ఫుడ్ సీక్రెట్ లీక్ చేసిన నందిని రెడ్డి.. రెండేళ్లుగా అదే ఆహారం!
Samantha's Food Secret: స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.5.35 కోట్ల నెట్‌తో ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా, పాజిటివ్ మౌత్ టాక్‌తో వీకెండ్‌లో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇలా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా కేవలం 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత ఫుడ్ సీక్రెట్ లీక్ చేసింది. రెండేళ్లుగా అదే ఒకే రకమైన ఆహారం తీసుకుంటుందని వెల్లడించింది. ఇంతకీ ఆ పుడ్ సీక్రెట్ ఏంటీ?
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. మయోసైటిస్‌తో పోరాడుతున్న ఆమె ఎలా కోలుకుందనే విషయంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి, సమంత ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'మా ఇంటి బంగారం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన నందిని రెడ్డి.. సమంత ఫుడ్ విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటుందో వివరించారు.

"గత రెండేళ్లుగా సమంత చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతోంది. ఒకసారి ఆమె తీసుకునే ఆహారాన్ని మేమూ సెట్లో ట్రై చేశాం. కానీ మా వల్ల అది తినడం కాలేదు. ఆ ఫుడ్‌లో ఉప్పు ఉండదు, కారం ఉండదు. రుచి అనే మాటే ఉండదు. బాయిల్ చేసి, ప్యూరీ చేసిన ఆహారాన్ని మాత్రమే మూడు పూటలా తీసుకుంటుంది. మేము తినే ఆహారానికి, ఆమె డైట్‌కు చాలా తేడా ఉంటుంది" అని చెప్పారు.
సమంత పాటిస్తున్నది సాధారణ డైట్ కాదని, ఆటో ఇమ్యూన్ సమస్యల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అని నందిని వెల్లడించారు. ఈ డైట్‌లో ఎన్నో ఆహార పరిమితులు ఉంటాయని, దాన్ని కచ్చితంగా పాటించడం అందరి వల్ల సాధ్యం కాదని అన్నారు. "ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే సమంత దాన్ని పూర్తిగా అమలు చేస్తుంది. అనారోగ్యంతో కూడా అదే పట్టుదలతో పోరాడింది" అని ప్రశంసించారు.
ఆటో ఇమ్యూన్ వ్యాధులకు పూర్తిస్థాయిలో శాశ్వత చికిత్స ఉండకపోయినా, సరైన ఆహార నియమాలు, జీవనశైలితో వాటిని రిమిషన్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నందిని తెలిపారు. సమంత కూడా అదే లక్ష్యంతో క్రమం తప్పకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను పాటించడంతో పాటు మెడిటేషన్, యోగా, వ్యాయామాన్ని తన దినచర్యలో భాగం చేసుకుందని చెప్పారు.
ఇక ఇటీవల సమంత తల్లి కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సమంత లేదా ఆమె టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో ఆమె పాటిస్తున్న కఠినమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ గురించి నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సమంత తన అభిమానులకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ అందించిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications




