మీరేదో సతి సావిత్రి అయినట్లు.. సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Samantha Raj Nidimoru wedding: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్ మారింది. సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ చర్చనీయంగా మారింది. డిసెంబర్ 1న కోయంబత్తూరులో హీరోయిన్ సమంత- డైరెక్టర్ రాజ్ నిడిమోరు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంప్రదాయ భూత శుద్ధి పద్దతిలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ కాగా, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో సామ్ రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ ట్రోల్స్ నేపధ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తనదైన శైలిలో స్పందించారు. నటి మాధవీలత ఎప్పుడు వార్తల్లో హైలెట్ అవుతుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంలోనూ రెస్పాండ్ అవుతుంది. ఇక రాజకీయాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు. ముందున్నది ఎవరు అన్నది లెక్క చెయ్యకుండా సూటిగా మాట్లాడుతుంది. సమాజంలో ఏ విషయం గురించైనా నేరుగా తన అభిప్రాయం చెప్పడంలో ముందుండే మాధవీలత, తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయం అంశంపై హీరోయిన్ సమంత రెండో పెళ్లి. సమంతపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ పై తనదైన స్టైల్ స్పందించారు.

మాధవీలత ఓ వీడియోలో మాట్లాడుతూ'సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో బాధ. ఆమె ఎవరిదో సంసారం కూల్చింది? అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చేస్తున్న మీరే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో అనే విషయాన్ని ప్రశ్నించుకోండి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకొకటి సంసారాన్ని కూల్చి పెళ్లి చేసుకున్నారు కదా.. అంటే అక్కడ మీరు తెలివిగా తప్పించుకున్నారా? అయితే.. కొందరూ విడాకులు ఇవ్వకుండా.. వేరే వారిని పెళ్లి చేసుకోకుండా.. వ్యవహరం నడిపిస్తున్నారా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అక్కడితో ఆగకుండా.. 'ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. పెళ్లిళ్లు స్వర్గంలోని నిర్ణయించబడతాయి. ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే.. అప్పటివరకు కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఒకరినొక రైతే చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి' అంటూ స్వభావానికి తగ్గట్లే సూటిగా వ్యాఖ్యాలు చేశారు. అక్కడే ఆగకుండా' మీరేమో పత్తితులు కాదు కదా.. ఇలా కామెంట్లు చేసేవారి గురించి నాకు బాగా తెలుసు' అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
ఈ వీడియో బయటకువచ్చిన వెంటనే నెట్టింట విపరీతమైన స్పందన మొదలైంది. కొంతమంది మాధవీలత వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరూ సమంత వ్యక్తిగత విషయంపై ఇలా వీడియోలు చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం "ఈసారి మాధవీలత నిజం చెప్పింది, సమంతపై హద్దుమీరిన కామెంట్లు అవసరం లేదు" అంటూ మద్దతు ఇస్తున్నారు. సమంత-రాజ్ నిడిమోరు పెళ్లిపై వస్తున్న చర్చలకు మాధవీలత ఇచ్చిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు దారితీసింది. ఇక ఈ వివాహంపై ఇంకా ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











