నాగచైతన్య చేస్తే ఒప్పు.. సమంత చేస్తే తప్పా? సామ్ రెండో పెళ్లిపై హేమ షాకింగ్ కామెంట్స్..
Samantha - Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సోమవారం (డిసెంబర్ 1) ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్ వీరి వివాహనికి వేదిక మారింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సహ్నితుల మధ్య వీరి వివాహం ప్రైవేట్‌గా జరిగింది. జంట సింపుల్ ట్రెడిషనల్ స్టైల్‌లో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం వీరి పెళ్లి చర్చనీయంగా మారింది. తాజా సమంత రెండో పెళ్లిపై నటి హేమ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
సమంత గత జీవితం గురించి అందరికీ తెలుసు. నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో ఆమె మొదటి వివాహం జరిగింది. అయితే.. కొన్ని మనస్పర్థల కారణంగా ఈ జంట 2021లో విడిపోయింది. గతేడాది నాగచైతన్య నటి శోభితాను వివాహం చేసుకున్నారు. ఇక సమంత తన కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం మీదే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దర్శకుడు రాజ్ నిడిమోరు పరిచయమయ్యారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' రూపొందించిన రాజ్, దాని రెండో సీజన్‌కు సమంతను తీసుకున్నారు. సామ్ పోషించిన రాజీ పాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కలిసి పనిచేసిన మొదటి ప్రాజెక్ట్. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య బంధం మొదలైందని పరిశ్రమలో టాక్. ఆ పరిచయం పెరిగి.. అది వివాహ బంధంగా మారింది.

సమంత సడెన్ గా రెండో పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో టాప్ టాపిక్ మారింది. పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ విష్ చేస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అయినా.. తాజాగా టాలీవుడ్ నటి హేమ(Hema) ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సమయంలో సమంత రెండో పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించగా..
తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. సమంత రెండో పెళ్లి గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటే.. ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు.. ఈ రోజు సమంత రెండో పెళ్లి చేసుకుంటే .. ప్రశ్నించారా? అంటూ నిలదీసింది.
నటి హేమ మాట్లాడుతూ.. 'ఇప్పుడు చాలా మంది కేవలం సమంత గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో కూడా ఎవరు కామెంట్ చేయలేదు. సమంత రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. కానీ, ఈ విషయంలో సమంతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధంకావడం లేదు. ఆడదానికి డబ్బుందని టార్గెట్ చేయడం ఏంటి? మగవారిని ప్రశ్నించలేరా? అది ఆ అమ్మాయి జీవితం.పెళ్లి చేసుకుంది. దానికి కంగ్రాట్స్ చెప్పల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సమంతకు ఓ తోడు కావాలి. ఆమె ఆరోగ్యం విషయంలో కావచ్చు, మానసికంగా కావచ్చు. ఆమెకు సపోర్టుగా ఒకరూ కావాలి. ఇద్దరూ ఒకరినొకరు నచ్చి పెళ్లి చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకోవడం చట్టబద్దమే' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక సమంత గురించి మాట్లాడుతూ.. సామ్ చాలా మంచి అమ్మాయి. ఆమె లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే, నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. 'చైతూ కూడా చాలా మంచి వ్యక్తి. చాలా బ్రాడ్ మైండ్ పర్సన్. వారిద్దరూ ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి విడిపోయారు. కానీ, బయటి వారే పలు రూమార్స్ క్రియేట్ చేశారు. నిజంగా చైతూ చాలా మంచి అబ్బాయి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడూ చట్టపరంగా విడిపోతే తప్పేముంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











