ఆ విషయంలో నాదే తప్పు.. సమంత షాకింగ్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో నిలుస్తారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సినిమాలు, ప్రొడక్షన్, బిజినెస్, ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇలా అన్ని విషయాల్లో తన దృష్టి సారించింది.అయితే.. తాజా ఆ విషయంలో నాదే తప్పు అంటూ షాకింగ్ పోస్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సంగతేంటీ? మీ కూడా ఓ లూక్కేయండి.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ. తన స్వంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures)' ద్వారా 'మా ఇంటి బంగారం' (maa inti bangaram) అనే చిత్రాన్ని నిర్మిస్తూ, అందులో నటిస్తోంది. ఈ మూవీలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత త్వరలో 'రక్త బ్రహ్మాండ' అనే వెబ్‌సిరీస్‌తో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె నటించిన 'ది ఫ్యామిలీ మాన్ 3' అమెజాన్ ప్రైమ్‌లో భారీ విజయాన్ని సాధించగా, సమంత దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాజిటివ్ రివ్యూలను షేర్ చేసింది.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిట్‌నెస్ జర్నీని షేర్ చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. "ఫుల్ యాక్షన్ మోడ్... బీస్ట్ మోడ్" అంటూ ఓ ఎమోషనల్ నోట్‌లో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. కొన్నేళ్ల క్రితం తన వెన్నెముక (స్ట్రాంగ్ బ్యాక్) బలహీనంగా ఉండటంపై తానే నిర్లక్ష్యం వహించానని, అది తన జీన్స్ వల్లేనని నమ్ముకున్నానని వెల్లడించింది.ఇతరుల ఫిట్‌నెస్ చూసి తాను అలాగెప్పటికీ మారలేనని అనుకునేదానని చెప్పిన సమంత, ఇప్పుడు ఆ ఆలోచన మొత్తం తప్పేనని అర్థమైందని తెలిపింది. క్రమశిక్షణతో కష్టపడితే ఏది సాధ్యమో తన శరీరమే ఇప్పుడు నిరూపిస్తోందని సమంత చెప్పింది.
"ఏ మార్పూ కనిపించని రోజుల్లో కూడా వర్కౌట్‌కి రావడం... వచ్చేసరికి వదిలేయాలనిపించినా ఆగకపోవడం... ఇవన్నీ సులభం కాదు. ఈ స్థాయికి రావడానికి చేసిన కష్టమే అసలు విజయానికి కారణం" అని పేర్కొంది. ఫిట్‌గా కనిపించడం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం, జీవనశైలి, వయస్సు పెరిగేకొద్ది శరీరం ఎలా పనిచేస్తుందన్న మసిల్ బిల్డింగ్ ఎంతో అవసరం అని సమంత ఈ సందర్భంలో గుర్తుచేసింది. అలాగే, వయస్సు పెరిగే కొద్ది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి భాగం కావాల్సిందేనని ఆమె తెలిపింది. "స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నాకు క్రమశిక్షణను, ఓర్పును నేర్పింది. 'జీన్స్‌లో లేదు' అనేది మనమే సృష్టించుకునే ఒక సాకు మాత్రమే... దాన్ని దాటి నిజం నిరూపించుకునే రోజు వస్తుంది" అని చెప్పింది.
ఇదిలా ఉంటే.. సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో కూడా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె సన్నిహితంగా ఉన్నారనీ, వారిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి తోడు తరుచూ వీరిద్దరూ కలిసి పార్టీలు, సినిమా ఈవెంట్స్ లకు వెళ్లడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చుతున్నట్టు అవుతుంది. ఇటీవల ఓ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది. దీంతో డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. అయితే.. ఈ విషయంపై సమంత గానీ, డైరెక్టర్ రాజ్ నిడిమోరు గానీ స్పందించలేదు.


Click it and Unblock the Notifications











