వాళ్లిద్దరిలో ఆ మ్యాజిక్.. పవన్ కల్యాణ్, సీఎం విజయ్‌పై సమంత కామెంట్స్

సినిమా రంగంలో స్టార్ హీరోలుగా రాణించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజా సేవల చేస్తుంటే, దళపతి విజయ్ ఎవరూ ఊహించని విధంగా తన పార్టీని అధికారంలోకి తీసుకవచ్చి, తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. సినిమాల్లోనే కాదు.. తన పాలనలో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు వీరిద్దరూ. అలాంటి ఈ ఇద్దరు నాయకులపై స్టార్ హీరోయిన్ సమంత చేసిన కామెంట్స్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు 'మా ఇంటి బంగారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రాలాలా బ్యానర్ పై సమంత -రాజ్ నిర్మించగా, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మా ఇంటి బంగారం సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. సాధారణ కోడలిగా అత్తారింటికి వచ్చిన ఒక మహిళకు ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుందనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. అయితే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా మారిపోయారు. ఇక హీరోయిన్ సమంత అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం ఒక్కే రోజు 40 ఇంటర్య్వూలు ఇచ్చిందట.

Samantha s Surprising Comments on Pawan Kalyan and CM Vijay Go Viral

ఈ సందర్భంలో ఫిల్మీబీట్ తెలుగు (Filmibeat Telugu)‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా మీరు నటించిన ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, మరొకరు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి?'అని ప్రశ్నించగా సమంత ఎంతో ఎమోషనల్‌గా స్పందించింది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే ఈ విషయం ఇప్పటికీ నాకు అన్‌బిలీవబుల్‌గా అనిపిస్తుంది. వాళ్లు ఈ స్థాయికి చేరుకుంటారని అప్పట్లో నేను ఊహించలేదు. కానీ వాళ్లతో కలిసి పనిచేసిన సమయంలో మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. వాళ్లిద్దరిలో ఏదో ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వాళ్లు చాలా భిన్నంగా ఉండేవారు. వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ప్రజలతో మెలిగే తీరు చూసినప్పుడు వాళ్లు ఏదో ఒక రోజు చాలా పెద్ద స్థాయికి వెళ్తారని అనిపించేది'అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్, విజయ్ గురించి వ్యక్తిగతంగా కూడా సమంత ప్రశంసలు కురిపించింది. 'వాళ్లిద్దరూ మంచి మనుషులు. నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. తెరపై స్టార్ హీరోలుగా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చాలా గొప్ప వ్యక్తులు. వాళ్లిద్దరితో కలిసి పని చేయడం నా కెరీర్‌లో ఎంతో గర్వంగా భావించే విషయాల్లో ఒకటి'అని పేర్కొంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయనలో ఉన్న నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న ఆలోచన ఎప్పుడూ తనను ఆకట్టుకునేదని తెలిపింది.

ఇక విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా కలిసారా? అనే ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయనను వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఫోన్ చేసి నా శుభాకాంక్షలు మాత్రం తెలియజేశాను. ఆయన సాధించిన ఈ విజయానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది' అని వెల్లడించింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో పవన్ కల్యాణ్, సమంత జంటగా 'అత్తారింటికి దారేది' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని పవన్ కల్యాణ్, సమంతల కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక దళపతి విజయ్, సమంత కాంబినేషన్‌ కూడా సూపర్ హిట్ ఫెయిర్. ఈ వీరిద్దరి కాంబోలో కత్తి, అదిరింది, 'పోలీసోడు' (తెరి). అనే బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల హిట్ తో సమంత తమిళనాడులో కూడా మార్కెట్ సంపాదించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X