twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రెగ్నెంట్ హీరోయిన్ స్పెషల్ ట్రీట్.. గౌన్‌ని పైకి ఎత్తి పట్టుకొని చిలిపిగా!

    |

    Recommended Video

    Actress Sameera Reddy Sensational Pic Goes Viral || Filmibeat Telugu

    తెలుగు తెరకు గ్లామర్ డోస్ రుచి చూపించిన హీరోయిన్లలో సమీరా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. గత పదిహేనేళ్ల క్రిందట ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. చాలా కాలంగా టచ్‌లో లేనప్పటీకీ ఈ మధ్యన మాత్రం సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరవుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఈ టైమ్‌లో కూడా దడ పుట్టించే హాట్ ఫోజులిస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతోంది.

    నిండు గర్భిణిగా ఉన్న ఆమె నేటితరం సోషల్ మీడియా జోరులో

    నిండు గర్భిణిగా ఉన్న ఆమె నేటితరం సోషల్ మీడియా జోరులో

    కొన్నేళ్ల క్రిందట బిజినెస్‌మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడిన సమీరా రెడ్డి.. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లయింది. ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపోవడంతో ఆ విషయం ఎవ్వరికీ పెద్దగా తెలియపర్చలేక పోయింది సమీరా. అయితే ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భం దాల్చింది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె నేటితరం సోషల్ మీడియా జోరులో పార్టిసిపేట్ చేస్తూ గర్భిణి గానే యమ హాట్ ఫోటో షూట్స్‌లో పాల్గొంటోంది.

    బేబీ బంప్ ఏ మాత్రం కనిపించకుండా

    ఇప్పటికే పలుమార్లు ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ చేసిన సమీరా తాజాగా మరో ఫోటో షూట్‌తో అందరి దృష్టిని లాగేసింది. కాకపోతే ఈ సారి కాస్త డిఫెరెంట్ గా ట్రై చేసింది. నిండు గర్భిణి అయినా కూడా బేబీ బంప్ ఏ మాత్రం కనిపించకుండా హాట్ ఫోజిచ్చి షాకిచ్చింది. ఈ పిక్ చూసిన వారెవ్వరు కూడా ఆమె గర్భిణి అంటే నమ్మరు.

    గౌన్‌ని పైకి ఎత్తి పట్టుకొని చిలిపిగా

    గౌన్‌ని పైకి ఎత్తి పట్టుకొని చిలిపిగా

    ఆరెంజ్ కలర్ గౌన్ వేసుకున్న సమీరా.. ఆ గౌన్‌ని పైకి ఎత్తి పట్టుకొని చిలిపిగా నవ్వుతూ కనిపిస్తోంది. ఇలాంటి పోజును ఇప్పటికే బాలీవుడ్ టు టాలీవుడ్ ఎంతోమంది హీరోయిన్లు ఇచ్చారు.. కానీ ఒక ప్రెగ్నెంట్ హీరోయిన్ ఈ స్టైల్‌లో ఫోటో షూట్ చేయడం ఇదే ప్రథమం. ప్రెగ్నెంట్ లేడీ అయినా ఫోటో మాత్రం యమ హాట్‌గా, సూపర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

     నయా ట్రెండ్‌కి శ్రీకారం

    నయా ట్రెండ్‌కి శ్రీకారం

    సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఫోటో షూట్స్‌కి దూరంగా ఉంటారు. కానీ హాట్ హీరోయిన్ సమీరా మాత్రం తాను ప్రత్యేకం అని నిరూపించుకుంటోంది. అంతేకాదండోయ్.. ఓ నయా ట్రెండ్‌కి కూడా శ్రీకారం చుడుతోంది. అయితే సమీరా పోస్ట్ చేస్తున్న ఈ పిక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం.

    English summary
    Sameera is currently making the most of her pregnancy and is setting new maternity fashion trends through her social media profiles. The actress never shies away from flaunting her pregnant belly..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X