ట్రోల్స్ చేస్తున్న వారికి సమీరా కౌంటర్.. అదే ప్రెగ్నెన్సీ లుక్‌తో నోరు మూయించింది

సోషల్ మీడియా బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో సెలెబ్రిటీలు ఎంతగా ఫోకస్ అవుతున్నారో అంతకంటే ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఫిమేల్ సెలెబ్రిటీల విషయంలో ఇది మరీ ఎక్కువ. తమకు నచ్చని ఓ ఒక్క ఫోటో కనిపించినా అస్సలు వదలడం లేదు నెటిజన్స్. సదరు ఫొటో పెట్టిన అమ్మడిని ఏకిపారేస్తూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సందర్భమే ఎదుర్కొన్న హీరోయిన్ సమీరా రెడ్డి.. తనను ట్రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

కొన్నేళ్ల క్రిందట బిజినెస్‌మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడిన సమీరా రెడ్డి.. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లయింది. ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపోవడంతో ఆ విషయం ఎవ్వరికీ పెద్దగా తెలియపర్చలేదు సమీరా. అయితే ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భం దాల్చింది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె నేటితరం సోషల్ మీడియా జోరు చూసి తన బేబీ బంప్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టేసింది. ఇవి చూసిన నెటిజన్స్ ఆమెపై విరుచుకు పడ్డారు. నిండు గర్బిణివై ఉండి ఈ ఫోటోలేంటి? అని తెగ ట్రోల్ చేశారు.

 Sameera Reddy lashes out at trolls with another pic of her baby bump

దీంతో కోపం తెచ్చుకున్న సమీరా.. అదే సామాజిక మాధ్యమం వేదికగా, అదే బేబీ బంప్ ఫొటో పెట్టి నెటిజన్లకు ఎమోషనల్ పంచ్ ఇచ్చింది. ''రేపో మాపో పుట్టబోయే నా బిడ్డ ఆత్మ ఎంతో బాధపడింది. నా కడుపులో స్విమ్ చేస్తున్న బిడ్డ ఆత్మను మీరు గాయపరిచారు. లావుగా ఉన్నానని.. ఎవరైతే నన్ను తిట్టేందుకు ఉబలాట పడ్డారో వాళ్లందరికీ ఇదే నా సమాధానం'' అని ఎమోషన్ తో కూడుకున్న కామెంట్ పెట్టి బేబీ బంప్ తో కూడిన తన తాజా పోటో పోస్ట్ చేసింది సమీరా.

తనపై వస్తున్న ట్రోల్స్ పై సమీరారెడ్డి స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా ఆమె పెట్టిన రియాక్షన్ చూసి అభినందిస్తున్నారు కొందరు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య లాంటి అగ్ర హీరోలతో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి. అయితే పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X