అలాంటి అమ్మాయిలపై డైరెక్టర్స్ మోజు.. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా..

Sameera Reddy: ఒకప్పుడు తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy). సమీరా రెడ్డి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత నరసింహుడు, మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. అలాగే బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ ఈ అందాల తార సమీరా. తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడి చర్చనీయాంశంగా మారారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఫెయిర్ స్కిన్‌పై ఉన్న మోజు, బాడీ షేమింగ్ వంటి అంశాలు తన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపాయో ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే నటనతో పాటు అందం కూడా ముఖ్యమని, టాలెంట్ కంటే అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. హీరోల విషయంలో ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, కానీ హీరోయిన్‌ల విషయంలో మాత్రం స్కిన్ కలర్, బాడీ స్ట్రక్చర్ పై ఎక్కువగా దృష్టి పెడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాను కూడా చాలా సందర్భాల్లో అవమానకర వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని, ఆ విషయంలో డైరెకర్ట్ లతో చాలా ఇబ్బంది పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

Sameera Reddy Opens Up on Fair Skin Bias and Body Shaming in the Film Industry

సమీరా రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఫెయిర్ స్కిన్‌పై ఉన్న మోజు వల్ల తన కూడా చాలా ఇబ్బంది పడ్డానని వెల్లడించారు. తన న్యాచురల్ కలర్ సరిపోదని, ఇంకా తెల్లగా కనిపించాలంటే లైట్ మేకప్ ఉపయోగించాలని కొందరు సూచించేవారని చెప్పారు. ముఖానికి మాత్రమే కాకుండా కెమెరాలో కనిపించే శరీర భాగాలన్నింటికీ మేకప్ వేయాలని ఒత్తిడి చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ పరిస్థితులు తనలో ఒక సమయంలో ఆత్మన్యూనత భావనను కలిగించాయని ఆమె వాపోయారు.

ఇండస్ట్రీలో టాలెంట్ కంటే బ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తనను మానసికంగా కలిచివేసిందని సమీరా తెలిపారు. తన నటన గురించి కాకుండా శరీరాకృతి గురించి ఎక్కువగా మాట్లాడేవారని ఆమె చెప్పారు. తాను పొడవుగా ఉండడం వల్ల వయసులో పెద్దదానిలా కనిపిస్తున్నావని కూడా కొందరు కామెంట్లు చేసేవారని పేర్కొన్నారు. అలా ట్రోల్ చేయడం వల్ల తన ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపాయని ఆమె వెల్లడించారు.

ఇక 2014లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.ఆ తర్వాత సమీరా సినిమాలకు దూరమయ్యారు. పెళ్లి తర్వాత కుటుంబ జీవితంపై దృష్టి పెట్టిన ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో సహజమైన మార్పులు వచ్చాయని, ముఖ్యంగా బరువు పెరగడం వల్ల సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.

ఆ సమయంలో వచ్చిన నెగెటివ్ కామెంట్లు తన ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని సమీరా చెప్పారు. అయితే రెండోసారి తల్లి అయిన తర్వాత తన ఆలోచన విధానంలో పెద్ద మార్పు వచ్చిందని, అప్పటి నుంచి తనను తాను అంగీకరించడం ప్రారంభించానని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేసినా వాటిని పెద్దగా పట్టించుకోనని, అలాంటి విమర్శలను న్యూట్రల్‌గా తీసుకోవడం నేర్చుకున్నానని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X