వాటి సైజ్ పెంచుకోమన్నారు.. పెద్దగా కనిపించేందుకు అవి వాడేదాన్ని: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్‌లోకి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా అడుగు పెడుతున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ రేటును సొంతం చేసుకుంటూ ఉండగా.. చాలా మంది మాత్రం వరుస ఫ్లాపులతో కెరీర్‌లను అర్థాంతరంగా ముగిస్తున్నారు. అలా డిజాస్టర్ హీరోయిన్‌గా చెడ్డ పేరును మూటగట్టుకున్న వారిలో తెలుగు భామ సమీరా రెడ్డి ఒకరు. కెరీర్ పరంగా సక్సెస్ కాలేకపోయిన ఈ భామ.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

తెలుగు భామ.. అలా పరిచయం
సమీరా రెడ్డి తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలోనే జన్మించింది. చదువుకుంటోన్న సమయంలోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి.

టాలీవుడ్‌లోకి.. డిజాస్టర్ల బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో సమీరా రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసినా నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేసినా పరాజయమే చవి చూసింది.

పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలు
ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటోన్న సమయంలోనే అంటే 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతోనే ఉంటోంది.

హీరోయిన్‌గా కష్టాలను చెబుతూ
పర్సనల్ లైఫ్‌తో పాటు మహిళల బ్యూటీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలతో సమీరా రెడ్డి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. 'నేను సరైన ఫిజిక్ మెయింటైన్ చేసేందుకు ఉదయం ఒక్క ఇడ్లీ మాత్రమే తినాల్సి వచ్చింది' అంటూ సమీరా చెప్పుకొచ్చింది.

బ్రెస్ట్ సర్జరీ చేయించమన్నారు
తాజా ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. 'హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన రోజుల్లో నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్న విషయాన్ని చాలా మంది ప్రస్తావించేవారు. అంతేకాదు, వాటి సైజ్‌ను పెంచుకునేందుకు సర్జరీ చేయించుకోమని చాలా మంది సలహాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో నాలో ఏదో తెలియని ఒత్తిడి ఎక్కువగా ఉండిపోయేది' అని వెల్లడించింది.

నేను మాత్రం అలా చేసేదాన్ని
ఆ తర్వాత సమీరా రెడ్డి కంటిన్యూ చేస్తూ 'నా బ్రెస్ట్ సర్జరీ గురించి చాలా మంది చెప్పడంతో ఆలోచనలో పడిపోయాను. అది మంచిదా కాదా అని ఎంక్వైరీ చేశాను. ఇక సర్జరీ వరకూ వెళ్లి ఎందుకులే అని ఆపేశాను. కానీ, బ్రెస్ట్ పెద్దగా కనిపించడం కోసం ప్యాడ్స్ పెట్టుకునేదాన్ని. ఇలాంటి కఠినమైన పరిస్థితుల నుంచి నేను చక్కగానే బయటపడ్డాను' అని వివరించింది.

ఎవరి ఇష్టం వాళ్లది అంటూనే
ఇక, సమీరా రెడ్డి మాట్లాడుతూ.. 'నేను సర్జరీ చేయించుకుని ఉండుంటే ఇప్పుడు సుఖంగా ఉండకపోయేదాన్ని. అయితే, ఇప్పుడు నేను సర్జీలు వద్దని చెప్పడం లేదు. ఒకవేళ ఎవరికైనా ఆ సర్జరీలు సంతోషాన్ని కలిగిస్తే తప్పుపట్టేందుకు వీల్లేదు. ఎవరి ఇష్టం వాళ్లది మాత్రమే. అందుకే ఈ విషయంలో నేను ఎలాంటి సలహాలను ఇవ్వలేను' అంటూ తన అభిప్రాయం చెప్పింది.

నా బాడీ అంటే నాకు ఇష్టం
అలాగే, డెలివరీ తర్వాత బాడీ షేమింగ్స్ గురించి ప్రస్తావిస్తూ..'నా బాడీ అంటే నాకు ఇష్టం.. నా శరీరాన్ని నేను ఇష్టపడతాను. నేను ఎలా ఉన్నానో అని వేరే వాళ్లు ఏమనుకుంటారో అంటూ ఇలా చాలా కాలం ఆలోచించి టైం వేస్ట్ చేశాను. నేను ఇప్పుడు కెమెరా ముందు బాగానే ఉన్నా. నాకు సౌకర్యంగానే ఉంది. ఇతరుల గురించి ఆలోచించాల్సిన అసరం లేదు' అని సమీరా పేర్కొంది.


Click it and Unblock the Notifications











