For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కడుపుతో ఉన్నా వదల్లేదు.. నా భర్త వల్లే ఇలా అయ్యాను: తెలుగు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీమణులు అడుగు పెడుతుంటారు. వారిలో కొందరి మాత్రమే సక్సెస్ వచ్చి ఫేమస్ అవుతుంటారు. మరికొందరైతే ఫ్లాపుల వల్ల కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఇలా టాలీవుడ్‌లోకి వచ్చి డిజాస్టర్ హీరోయిన్‌గా చెడ్డ పేరును మూటగట్టుకున్న వారిలో సమీరా రెడ్డి ఒకరు. చాలా రోజులుగా తెలుగు వారికి దూరమైన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మన సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, కడుపుతో ఉన్నా తనను వదల్లేదని చెబుతూ సమీరా రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  తెలుగులో మూడు సినిమా.. అన్నీ డిజాస్టర్

  తెలుగులో మూడు సినిమా.. అన్నీ డిజాస్టర్


  జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సమీరా రెడ్డి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ' అనే మూవీ చేసింది. ఇది కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో ‘అశోక్' చేయగా.. అదీ ఫ్లాప్ అయింది.

  అక్కడ మాత్రం సక్సెస్.. ఐటమ్ గర్ల్‌గా ఎంట్రీ

  అక్కడ మాత్రం సక్సెస్.. ఐటమ్ గర్ల్‌గా ఎంట్రీ


  తెలుగులో మూడు సినిమాలు చేసినా.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో మన పరిశ్రమకు దూరమైందామె. అదే సమయంలో హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి సమయంలో దగ్గుబాటి రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురం' సినిమాలో ఐటం గర్ల్‌గా కనిపించింది.

  పెళ్లి చేసుకుంది... ఇద్దరు పిల్లలతో ఖుషీగా

  పెళ్లి చేసుకుంది... ఇద్దరు పిల్లలతో ఖుషీగా


  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అంటే 2013లో సినిమాలకు దూరమైంది. ఆ వెంటనే 2014లో ఆక్షయ్ అనే వ్యక్తిని వివాహమాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. ఆమె మాత్రం స్పందించలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు తల్లైంది. ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

  తెలుగు సినిమాలపై సమీరా రెడ్డి కామెంట్స్

  తెలుగు సినిమాలపై సమీరా రెడ్డి కామెంట్స్


  చాలా రోజుల తర్వాత సమీరా రెడ్డి ఓ తెలుగు సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో తాను చేసిన సినిమాపై స్పందించింది. ‘నేను చేసిన తెలుగు సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దానికి ఎవరినీ నిందించడం లేదు. ఎలా జరగాలని ఉంటే అలా అవుతుంది. ప్రతి ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారన్నది అందరూ గుర్తు పెట్టుకోవాలి' అని ఆమె చెప్పుకొచ్చింది.

  కడుపుతో ఉన్నా నన్ను వదల్లేదంటూ అలా

  కడుపుతో ఉన్నా నన్ను వదల్లేదంటూ అలా

  ఈ ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడుతూ.. ‘తల్లిగా మారాక అందంగా కనిపించడం కొందరికే సాధ్యమవుతుంది. మళ్లీ నేను సన్నగా, అందంగా కనిపించడానికి కాస్త సమయం పడుతుంది. అయినా ఇప్పుడు నా బిడ్డల గురించే ఆలోచించాలి. గర్భిణిగా ఉన్నప్పుడు ఫోటోను పోస్టు చేస్తే.. కడుపుతో ఉన్నా వదలకుండా బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్‌ చేశారు' అని బాధ పడింది సమీరా రెడ్డి.

  భర్త వల్లే ఇలా ఉన్నానని కన్నీటి పర్యంతం

  భర్త వల్లే ఇలా ఉన్నానని కన్నీటి పర్యంతం


  తన భర్త గురించి చెబుతూ.. ‘పిల్లల్ని కనాలనుకుంటే వచ్చే శారీరక, మానసికమైన మార్పులకు ముందుగానే సిద్ధపడాలి. నేను నా మొదటి ప్రెగ్నెన్సీకి ఏమాత్రం సిద్ధంగా లేను. ఫలితంగా కోపం, ఫ్రస్ట్రేషన్‌, నాకు నేనే నచ్చకపోవడం వంటివి జరిగాయి. నా భర్త అక్షయ్‌ ఎంతో సహనంతో అండగా నిలిచాడు. ఆయన వల్లే ఇప్పుడిలా ఉన్నాను' అంటూ కన్నీటి పర్యంతం అయిందామె.

  English summary
  Sameera Reddy is a former Indian actress who primarily starred in Hindi-language films. She has also appeared in a few Tamil, Telugu, Bengali, Kannada and Malayalam-language films. Sameera Reddy made her film debut with the 2002 film Maine Dil Tujhko Diya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X