For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!

  |

  ఎంతో మంది అమ్మాయిలు నటీమణులు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగు పెడుతుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌లు వచ్చి ఫేమస్ అవుతుంటారు. కానీ, మిగిలిన వాళ్లు మత్రం ఫ్లాపుల వల్ల కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఇలా టాలీవుడ్‌లోకి వచ్చి వరుస పరాజయాలతో డిజాస్టర్ హీరోయిన్‌గా చెడ్డ పేరును మూటగట్టుకున్న వారిలో సమీరా రెడ్డి ఒకరు. పేరుకు తెలుగు అమ్మాయే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక, వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. అలాగే, బాడీ షేమింగ్‌పై కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలు మీరే చూడండి!

  అలా పరిచయం.. అక్కడే ఎక్కువగా

  అలా పరిచయం.. అక్కడే ఎక్కువగా

  సమీరా రెడ్డి తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే ఈ అమ్మడు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'మైనే దిల్ తుజ్‌కో దియా' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత అక్కడ ఎన్నో సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీంతో దక్షిణాది పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి.

  నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

  తెలుగులో మూడు.. అన్నీ డిజాస్టర్స్

  తెలుగులో మూడు.. అన్నీ డిజాస్టర్స్

  జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' మూవీతో సమీరా రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' అనే మూవీ చేసింది. ఇది కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో 'అశోక్' చేయగా.. అదీ నిరాశనే మిగిల్చింది.

  అక్కడ ఫుల్ బిజీగా.. ఐటెం సాంగ్స్

  అక్కడ ఫుల్ బిజీగా.. ఐటెం సాంగ్స్

  టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసినా.. సమీరా ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో మన పరిశ్రమకు దూరమైంది. అదే సమయంలో హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి సమయంలో దగ్గుబాటి రానా నటించిన 'కృష్ణం వందే జగద్గురం' సినిమాలో ఐటం గర్ల్‌గా చేసింది.

  Bimbisara Twitter Review: బింబిసారకు అలాంటి టాక్.. అఖండ, RRR తర్వాత ఇదే.. అదొక్కటే పెద్ద మైనస్

  పెళ్లి చేసుకుంది.. ఇద్దరు పిల్లలతో

  పెళ్లి చేసుకుంది.. ఇద్దరు పిల్లలతో

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే అంటే 2013లో సినిమాలకు దూరమైంది. ఆ వెంటనే 2014లో ఆక్షయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ మధ్యలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగినా.. అది మాత్రం జరగలేదు. పైగా వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు తల్లైంది. ఆ ఫీలింగ్‌నే ఎంజాయ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీతోనే గడుపుతోంది.

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్

  అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన, తన ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ హైలైట్ అవుతోంది.

  శ్రీహాన్‌ను మోసం చేసిన సిరి హన్మంత్: అడ్డంగా దొరికి బుక్కైపోయిన బ్యూటీ

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమీరా

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమీరా


  సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో చాలా మందికి తెలుసు. ఆమె ఎక్కువగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తోన్న పిక్స్‌ను షేర్ చేస్తుండేది. ఇక, తాజాగా ఈ అమ్మడు షర్ట్ విప్పేసి మరీ ఎద అందాలు కనిపించేలా ఘాటు ఫోజులిచ్చింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  బాడీ షేమింగ్‌పై అదిరిపోయే రిప్లై

  బాడీ షేమింగ్‌పై అదిరిపోయే రిప్లై

  తాజాగా తన హాట్ ఫొటోలను షేర్ చేసిన సమీరా.. 'నా బాడీ అంటే నాకు ఇష్టం.. నా శరీరాన్ని నేను ఇష్టపడతాను. నేను ఎలా ఉన్నానో అని వేరే వాళ్లు ఏమనుకుంటారో అంటూ ఇలా చాలా కాలం ఆలోచించి టైం వేస్ట్ చేశాను. నేను ఇప్పుడు కెమెరా ముందు బాగానే ఉన్నా. నాకు సౌకర్యంగానే ఉంది. ఇతరుల గురించి ఆలోచించాల్సిన అసరం లేదని తెలుసుకున్నా. శరీరాల్లో మార్పులు వస్తుంటాయ్.. అయితే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు మనం ప్రయత్నించాలి. మీ శరీరాన్ని మీరు ఎక్కువగా కష్టపెట్టకండి.. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి' అని చెప్పింది.

  English summary
  Former actress Sameera Reddy Very Active In Social Media. Now She Shares Hot Pics And Gave Strong Reply on Body Shaming Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X