Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నన్ను ఆ సమస్య వెంటాడింది.. ఆ స్టార్ హీరో కారణంగానే.. సమీరా రెడ్డి
దక్షిణాదిలో గ్లామర్, టాలెంట్‌తో ఆకట్టుకొన్న హీరోయిన్లలో సమీరా రెడ్డి ఒకరు. పెళ్లి, సంతానం తర్వాత ఆమె సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో చక్కటి అనుభూతిని పొందుతున్నట్టు పలుమార్లు మీడియాతో పంచుకొన్నారు. ఇటీవలే సమీరా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తల్లిగా బిడ్డల సంరక్షణ చూసుకొంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ కనిపిస్తున్నారు. తాజాగా తనకు సంబంధించిన ఓ లోపం గురించి అభిమానులతో పంచుకొన్నారు. ఆ లోపాన్ని సరిదిద్దిన హీరో పేరు ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతకు సమీరా రెడ్డికి ఉన్న లోపం ఏమింటంటే.
నేను ఆ సమస్యతో బాధపడుతుంటే
గతంలో సమీరా రెడ్డికి నత్తి ఉండేదట. మీడియాతో మాట్లాడేటప్పుడు మాటలు సరిగా పలకలేకపోవడం జరిగేదట. అలా ఇబ్బందులు పడుతూ మీడియాతో మాట్లాడుతూంటే బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ గమనించి ఆమెకు సహాయం అందించారు. నత్తిని నివారించే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు అని ఇటీవల సమీరా రెడ్డి మీడియాకు వెల్లడించారు.
హృతిక్ రోషన్ కారణంగానే
హృతిక్ రోషన్ ఇచ్చిన పుస్తకం ఆధారంగానే నేను నా నత్తి లోపాన్ని సవరించుకొన్నాను. అప్పటి నుంచి మీడియాలో గానీ, పబ్లిక్‌గా గానీ ఎలాంటి బిడియం లేకుండా మాట్లాడం ప్రారంభించాను. హృతిక్ నాకు సహాయం అందించకపోతే ఆ లోపంతో మానసికంగా బాధపడుతూ ఉండేదానినినేమో అంటూ సమీరారెడ్డి పేర్కొన్నారు. నాకు సరైన సమయంలో హృతిక్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనన్నారు.
హృతిక్ లేకపోతే
గతంలో కూడా హృతిక్ నత్తి సంబంధిత సమస్య ఉండేది. ఓ పుస్తకం ఆధారంగానే ఆయన ఆ ఇబ్బందిని అధిగమించారు. తను పడుతున్న బాధను చూసే ఆయన చొరవ తీసుకొన్నాడు. నత్తి కారణంగా ఇతరుల ముందు మాట్లాడలేక ఇబ్బంది పడేదాన్ని. నాలో భావాలను సరిగా చెప్పలేకపోయే దానిని. హృతిక్ లాంటి మంచి మనిషి వల్ల నాకు బిడియం లేకుండా మాట్లాడే అవకాశం కలిగింది అని సమీరా తెలిపారు.
చిట్కాలను అనుసరించి
హృతిక్ అందించిన పుస్తకంలోని చిట్కాలను ప్రాక్టీస్ చేయడం వల్ల నేనే మాట్లాడే తీరులో స్పష్టత కనిపించింది. కొంత మంది స్పీచ్ థెరపిస్టుల వద్దకు కూడా వెళ్లాను. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడటం చూసి నా సన్నిహితులు కూడా ఆశ్చర్యపోయారు. దానంతటికి కారణం హృతిక్ రోషన్ మాత్రమే. ఓ మంచి పుస్తకం ఇచ్చి నాలో మానసిక ధైర్యాన్ని నింపిన హృతిక్‌కు రుణపడి ఉంటాను అని సమీరా చెప్పారు.