Valentine's Day మ్యారేజ్ ఓ గ్యాంబ్లింగ్.. సరైన బాయ్‌ఫ్రెండ్ దొరికితే.. లవ్ అఫైర్ గురించి సంయుక్త మీనన్
మలయాళం నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా మారుతున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం ధనుష్‌తో కలిసి సార్ (తమిళంలో వాతి) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతున్నారు. భీమ్లా నాయక్ తర్వాత వరుసగా సార్, విరూపాక్ష సినిమాలతో దూసుకెళ్తున్న ఈ యువతార తాను నటించిన సినిమా గురించి.. అలాగే వాలంటైన్ ముచ్చట్లు.. అలాగే వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ..

లవ్ అంటే ప్రియుడితో రొమాంటిక్ లైఫ్ కాదు
ప్రేమ గురించి పర్టిక్యులర్‌గా నిర్వచించలేం. విశ్వవ్యాప్తంగా ఒక్కోరూపంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రేమ అంటే అన్నీ మరిచిపోయి బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ లైఫ్‌నే లవ్‌గా చూస్తున్నారు. లవ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. రొమాంటిక్ విషయాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. లవ్ అంటే అమ్మ, తల్లిదండ్రులను, ప్రొఫెషన్‌ను లవ్ చేయడం పరిగణనలోకి తీసుకోవడం లేదు అని సంయుక్త అన్నారు.

పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు
ఇక మ్యారేజ్ అనేది గ్యాంబ్లింగ్. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. నాకు సరైన జీవిత భాగస్వామి దొరికితే నేను అప్పుడు ఆలోచిస్తాను. ఒకప్పడు వివాహం ఒక అవసరం. అమ్మాయికి ఎమోషనల్ బ్యాకప్, ఫైనాన్సియల్ సపోర్ట్ కోసం పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రతీ అమ్మాయి తన సొంత కాళ్లపై నిలబడి బతుకుతున్నది. పెళ్లి అనేది వ్యక్తిగతంగా ఒక ఛాయిస్ మాత్రమే అని సంయుక్త మీనన్ అభిప్రాయపడ్డారు.

మీనన్ పేరును తొలగింపుపై
సంయుక్త మీనన్ పేరులో మీనన్‌ను తొలగించడంపై స్పందిస్తూ.. నా ఐడెంటిటిని నా కులం, మతం చెప్పనక్కర్లేదనేది నా అభిప్రాయం. నా పేరులో మీనన్ అనే పదాన్ని తొలగించమని అడిగాను. నా పేరులో మీనన్ ఉండకుంటేనే బాగుంటుందని నేను అనుకొంటున్నాను. కేరళలో ఆధునిక భావజాలం ఉంటుంది. కేరళ నుంచి రావడం వల్ల నేను విశాల దృక్పథంగా ఉంటాననిపిస్తుంది అని సంయుక్త చెప్పారు.

నా పేరులో మీనన్ తొలగించడంపై
సంయుక్త మీనన్ పేరులో మీనన్ పదాన్ని తొలగించడానికి ప్రత్యేక కారణం ఉంది. నా తల్లిదండ్రులు దాంపత్య జీవితంలో కలతలు ఏర్పడటంతో వారిద్దరూ విడిపోయారు. అందుకే నా తండ్రి పేరును నా పేరు నుంచి తొలగించుకొన్నాను. నా పేరుకు తోకలు ఉండనవసరం లేదు. నేను స్వయంగా ఎదిగి యాక్టర్ అయ్యాను. కాబట్టి సంయుక్తనే నా ఐడెంటిటి అని చెప్పారు.

సమంత మాదిరిగా ఉన్నానంటే..
అయితే ఇటీవల కాలంలో చాలా మంది నన్ను సమంత మాదిరిగా ఉన్నానని అంటున్నాను. సమంత మాదిరిగా ఉన్నారని చెప్పడం నేను కాంప్లిమెంట్‌గా తీసుకొంటాను. అయితే సమంత కంటే గొప్పగా యాక్టింగ్ చేస్తున్నావని ఎవరైనా అంటే.. నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది అని సంయుక్త చెప్పారు.


Click it and Unblock the Notifications











