నాకు ఆ అలవాటుంది .. కంట్రోల్ చేసుకోలేను, సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్

మనిషి అన్నాకా అందరికీ లోపాలు, వ్యసనాలు, బలహీనతలు ఉంటాయి. ఎవ్వరూ దీనికి అతీతం కాదు.. కొందరు తమ లోపాలను బయటపెట్టుకుంటే.. మరికొందరు గుట్టుగా ఉంచుతారు. ఇక సెలబ్రెటీలుగా వెలుగొందుతున్న వారు తమ లోపాలను చాలా సీక్రెట్‌‌గా ఉంచుకుంటారు. వాటిపై ఏమైనా వార్తలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దని, అవి గాసిప్సేనంటూ తేల్చేసేవారు. తాజాగా తనకున్న అలవాటును ఓపెన్‌గా చెప్పేశారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సంయుక్త మీనన్. ఆర్ధిక శాస్త్రంలో పట్టభద్రురాలైన ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఆసక్తితో 2016లో 20 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. అదే మలయాళ చిత్రం పాప్‌కార్. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో తమిళ్, మలయాళ చిత్రాల్లో సంయుక్త మీనన్‌కు అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానాలు నటించిన మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్‌లో రానాకు హీరోయిన్‌గా నటించి తెలుగు వారిని పలకరించింది.

Samyuktha Menon Akhanda 2 heroine made sensational comments about drinking

ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి వరుస భారీ బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్ హీరోయిన్ నిలవడంతో పాటు లక్కీ హీరోయిన్‌గా నిలిచారు. ఆమె నటించిన ఏ సినిమా అయినా హిట్ అనే సెంటిమెంట్‌ బలంగా పడిపోవడం కూడా సంయుక్త కెరీర్‌కు ప్లస్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రాలతో పాటు నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ మూవీలోనూ సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్‌కే పరిమితమైన సంయుక్త ఇందులో పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. మొన్నామధ్య ఆమె పుట్టినరోజు సందర్భంగా స్వయంభూ చిత్రంలో వీరనారిలా బాణాలు వేస్తున్న ఫోటోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇక గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ వాణిజ్య ప్రకటన చేస్తున్న సమయంలో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందా అని సంయుక్త అనుకున్నారట. అలాంటిది బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అఖండ-2లో ఆఫర్ రావడంతో సంయుక్త ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా కోసం ఎంతటి కష్టానికైనా తాను సిద్ధమని ఎన్నోసార్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తాను నటిస్తోన్న ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారట. తెలుగులో నారీ నారీ నడుము మురారి, హైందవ తదితర చిత్రాలతో సంయుక్త ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే రెండేళ్లలో ఆమె డైరీ ఖాళీ లేదని ఫిలింనగర్ టాక్.

ఇటీవల తెలుగు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సంయుక్త మీనన్.. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలవాటు ఉందని రోజూ తాగకుండా , ఒత్తిడికి, ఆందోళనకు గురైనప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటానని సంయుక్త ఓపెన్‌గా చెప్పేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హీరోయిన్లు పర్సనల్ విషయాలను ఎప్పుడూ బయటపెట్టరని, అలాంటిది మీరు ఓపెన్‌గా చెప్పడం గ్రేట్ అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X