నాకు తాగే అలవాటుంది.. సంయుక్త మీనన్ షాకింగ్ సీక్రెట్స్!

తెలుగు ప్రేక్షకులకు సంయుక్తా మీనన్ చాలా బాగా దగ్గరైన విషయం తెలిసిందే. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ ను కూడా మెప్పించగలిగింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ 'బీమ్లా నాయక్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డేనియల్ శంకర్ రానా దగ్గుబాటి వైఫ్ పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చోటు దక్కించుకుంది. బీమ్లా నాయక్ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది.

ఓవైపు సినిమాల ద్వారా సంయుక్తా మీనన్ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. పలు ఇంటర్వ్యూల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా మాత్రం సంయుక్తా మీనన్ ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. తన లైఫ్ స్టైల్ ను వివరించే క్రమంలో తాను అల్కహాల్ కూడా తీసుకుంటానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. 'ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరికీ భిన్నమైన లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంది.' అని చెప్పుకొచ్చింది.

Samyuktha Menon reveals her life style Food and alcohol habits

తను ఎలాంటి చెడు అలవాట్లు లేవన చెప్పింది. కానీ కొన్ని ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాల్లో మాత్రం అతికొద్దిగా వైన్ మాత్రం తీసుకుంటానని చెప్పింది. ఫిజిక్, బ్యూటీ పరంగానూ కొన్ని అలవాట్లు వస్తాయని చెప్పింది. ఏదేమైనా సంయుక్తా మీనన్ ముక్కు సూటిగా చెప్పడం విశేషం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సంయుక్తా మీనన్ కామెంట్స్ మాత్రం వైరల్ గా మారాయి. ఇక ఈ బ్యూటీ తెలుగు, మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయ్యింది. రోటీన్ కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ మంచి సక్సెస్ ను అందుకుంటోంది. ప్రజెంట్ చేసే సినిమాలు కూడా హైప్ ను క్రియేట్ చేస్తుండటం విశేషంగా మారింది.

సంయుక్తా మీనన్ 'బింబిసార'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే తమిళంలో 'సార్' చిత్రం కూడా మంచి సక్సెస్ ను అందించింది. ఆ తర్వాతే 'విరూపాక్ష' కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇలా వరుస చిత్రాలతో సక్సెస్ అందుకుని అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. దీంతో మరిన్నిప్రాజెక్ట్స్ ను కూడా చేజిక్కించుకుంది. ప్రధానంగా టాలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసింది. అందులో క్రేజీ ప్రాజెక్ట్ 'బింబిసార 2', నిఖిల్ 'స్వయంభు', నందమూరి బాలక్రిష్ణ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ సీక్వెల్ 'అఖండ2'లో కూడా సంయుక్తా మీనన్ అవకాశం దక్కించుకుంది. మొత్తానికి సంయుక్తా మీనన్ ఏడాది గ్యాప్ తర్వాత ఈ ఏడాది వరుస పెట్టి సినిమాలతో అలరించబోతోంది. ఫ్యాన్స్ కూడా ఆమె అప్ కమింగ్ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: samyuktha menon samyuktha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X