ఆఫర్ ఇస్తా.. నాతో పడుకొంటావా? సౌత్ డైరెక్టర్ పై హీరోయిన్ సంచలన ఆరోపణలు
Sanaya Irani: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. వెండి తెర నుంచి బుల్లితెర వరకు ఎన్నో మంది తారలు కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు తెలుస్తోంది. తాము కూడా తొలినాళ్లలో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని తమ బాధను కొంతమంది బహిరంగంగా వెలిబుచ్చుతున్న విషయం కూడా తెలిసిందే. అలాగే.. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికమనీ చెబుతున్నారు. అలాగే.. ఇండస్ట్రీలో అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ నటి తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీరో లూక్కేయండి.
తాజాగా ప్రముఖ టెలివిజన్ స్టార్ హీరోయిన్ సనాయా ఇరానీ.. తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తాను కూడా బాధితురాలినేని, తొలినాళ్లలో తనతో ఓ బడా బాలీవుడ్ డైరెక్టర్ అనుచితంగా ప్రవర్తించారని చెప్పుకోచ్చారు. మ్యూజిక్ ఆడిషన్ అని అబద్దం చెప్పి సినిమా ఆడిషన్ కు పిలిచారని, షూటింగ్ సమయంలో తనన బికినీ ధరించమని ఓ సౌత్ ఇండియాకు చెందిన ఓ బడా డైరెక్టర్ బలవంతపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ తరువాత ఆ దర్శకుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అతనితో కలిసి పని చేయడం ఆపేసినట్టు వెల్లడించింది.

ఇటీవల సనయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా కాలం క్రితం.. ఓ సౌత్ ఇండియాకు చెందిన ఓ బడా డైరెక్టర్ నన్ను సినిమాకి సంబంధించి కలవాలనుకున్నాడు. కానీ, ఆ సమయంలో నాకు సినిమాల్లో నటించాలని లేదు. కానీ ఆ వ్యక్తి మాత్రం నన్ను పదేపదే కలువాలని అడుగుతుండేవాడు. చివర ఓ రోజు ఆ డైరెక్టర్ ను కలవడానికి వెళ్లాను. ఆ దర్శకుడు నన్ను హోటల్‌లో కలవడానికి పిలిచారు.
తన సినిమాలో ఓ రోల్ ఉండదనీ, అందుకు తనని బికినీ వేసుకోమని ఒత్తిడి చేశారు. ఆ తరువాత.. ఆ డైరెక్టర్ తనతో బెడ్ షేర్ చేసుకుంటుందా? అని ఇతరులతో పరోక్షంగా అడిగించారని చెప్పుకోచ్చింది. సనయ తాను ఎదుర్కొనిని తన సమస్యను వెల్లడించింది కానీ.. దర్శకుడి పేరును వెల్లడించలేదు.

బుల్లితెర నటి సనయా ఇరానీ 2006లో వెండితెరపై కాలుపెట్టింది. తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో తొలిసారి సిల్వర్ స్కీన్ పై కనిపించింది. ఆ తర్వాత టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నటి చాలా కాలంగా తెరకు దూరంగా ఉంది. తాజాగా ఈ భామ బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
కసమ్ సే, రాధా కీ బేటియాన్ కుచ్ కర్ దిఖాయేంగీ, కహో నా యార్ హై, జరా నాచ్కే దిఖా 2, మిలే జబ్ హమ్ తుమ్ వంటి పలు టీవీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి సనాయా ఇరానీ. చాలా కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నా ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఆప్డేట్ ఇస్తూ.. తన అభిమానులను పలుకరిస్తుంటుంది.


Click it and Unblock the Notifications











