రేయ్ మా మిల్కీ బ్యూటీని ఏం చేస్తున్నావురా: సందీప్ కిషన్‌కు తమన్నా ఫ్యాన్స్ సెగ!
సందీప్ కిషన్, తమన్నా హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి, అక్షయ్ పురి ప్రొడక్షన్స్ పతాకాలపై రైనా జోషి ఈ చిత్రాన్ని నిర్మించారు.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో హీరో సందీప్ కిషన్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో సందీప్ కిషన్ ఓ సీన్లో హీరోయిన్‌కు ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఆ హీరోయిన్‌ను తమన్నా అనుకుని ఆమె అభిమానులు సందీప్ కిషన్ మీద కామెంట్లతో విరుచుకుపడుతున్నారట.

రేయ్.. మా తమన్నాను ఏం చేస్తున్నావురా అని కామెంట్స్
‘‘తమన్నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘నెక్ట్స్ ఏంటి?' ట్రైలర్ చూసి ఆమె అభిమానులు నన్ను తిడుతున్నారు. రేయ్ రేచ్ ఏం చేస్తున్నావురా మా మిల్కీ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ట్రైలర్లో కనిపించే ఆ ముద్దు తమన్నాతో కాదు.'' అని సందీప్ కిషన్ స్పష్టం చేశారు.

కావాలంటే తమన్నా అంగ్రిమెంట్ చెక్ చేసుకోండి
తమన్నా ఈ సినిమా కోసం సైన్ చేసిన కాంట్రాక్ట్ అగ్రిమెంటులో కూడా కిస్సింగ్ సీన్లు లేవని ఉంటుంది. మీరు తిట్టుకోవాలంటే నన్ను తిట్టుకోవద్దు.... అని సందీప్ కిషన్ తమన్నా అభిమాలను రిక్వెస్ట్ చేశారు.

ఇది రెండు క్యారెక్టర్ల మధ్య జరిగే జర్నీ
రొమాంటి, కామెడీ, ఎంటర్టెనర్... ఇన్ని రకాల జోనర్లు మా సినిమాలో లేవు. ఇది రెండు క్యారెక్టర్ల స్టోరీ. హైలీ ఎంటర్టెనింగ్ వేలో ఉంటుందని సందీప్ కిషన్ స్పష్టం చేశారు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని వెల్లడించారు.

నెక్ట్స్ ఏంటి?
ఈ చిత్రంలో నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. బాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో, సెక్స్, లవ్ అంశాల మేళవింపు కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











