Sangeerthana Vipin : బ్లాక్ శారీలో జిగేలుమనేలా సంగీర్తన .. బ్యాక్‌లెస్ అందాలతో రచ్చ
తెలుగు తెరపై కేరళ, కన్నడ భామలదే హవా. సినిమా ఏదైనా సరే వీరు ఉండాల్సిందే. ప్రతి ఏటా కొత్త కొత్త అందాలు టాలీవుడ్‌క దిగుమతి అవుతున్నాయి. అలా తెలుగు వారిని పలకరించారు సంకీర్తన విపిన్. యంగ్ హీరో సుహాస్ హీరోగా వచ్చిన జనక అయితే గనకతో ఈమె బాగా పాపులర్ అయ్యారు . సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సంకీర్తన ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే.
నవంబర్ 6, 2002న కేరళలోని కాసర్‌గాడ్ సమీపంలోని నీలేశ్వర్‌లో జన్మించారు సంకీర్తన విపిన్. సినిమాలు చేస్తూనే కెరీర్‌పై దృష్టి సారించిన ఈమె ప్రస్తుతం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం) చదువుతున్నారు. సినిమాలను, చదువును బ్యాలెన్స్ చేస్తూ సంకీర్తన సాగుతున్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తిని కనబరిచిన ఆమె .. ఓరు వడక్కన్ కెట్టుకద అనే మలయాళం వెబ్ సిరీస్ ద్వారా నటిగా మారారు. తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంకీర్తన.

అనంతరం గతేడాది రక్షిత్ అట్లూరి హీరోగా తెరకెక్కిన నరకాసురతో తెలుగు వారిని పలకరించారు. ఇందులో సంకీర్తన పోషించిన వీరమణి రోల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. పల్లెటూరి అమ్మాయిగా సంకీర్తన తన క్యూట్ లుక్స్‌తో జీవించేశారు. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో సంకీర్తనకు మరిన్ని అవకాశాలు వెల్లువెత్తడంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి దోహదం చేసింది.
ఈ సినిమా తర్వాత మరోసారి రక్షిత్ అట్లూరితోనే జత కట్టారు సంకీర్తన . వెంకట సత్య దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ రావణ్ మూవీలో ఆమె నటించారు. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ సినిమాలో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంకీర్తన జీవించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నిజాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తారు.
ఇక లేటెస్ట్‌గా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో అవకాశం దక్కించుకున్నారు సంకీర్తన విపిన్. అదే సుహాస్ హీరోగా వచ్చిన జనక అయితే గనక. ప్రస్తుత పరిస్ధితుల్లో పిల్లల్ని కనకూడదనే భర్తకు సహకరించే భార్యగా ఆమె అద్భుతంగా నటించారు. అమాయకత్వాన్ని ఒలికించడంతో పాటు పతాక సన్నివేశాల్లో శెభాష్ అనిపించుకున్నారు. భావోద్వేగాలు, డ్రామా పండించడంలో అప్పుడే ఆరి తేరిపోయారు సంకీర్తన. ఈమె జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగు తెరను దున్నేస్తుందా అంటూ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సంకీర్తన విపిన్ .. తన వ్యక్తిగత, సినిమా సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ శారీలో చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నడుము మడతలు, బ్యాక్ లెస్ అందాలను చూపిస్తూ సంకీర్తన మెరిసిపోతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం సంకీర్తన అందాలను మీరూ చూసేయ్యండి.


Click it and Unblock the Notifications











