ఆ విషయంలో సల్మాన్ అలా వేధించే వాడు.. బ్రేకప్‌ గురించి బయటపెట్టిన మాజీ ప్రియురాలు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన అఫైర్లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటి వెనుక ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా ఉంటుంది. దాదాపు 60 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. అయితే పెళ్లి పీటల వరకు వచ్చి, కార్డులు పంచే స్థితికి వచ్చి ఆగిపోయిన పెళ్లి గురించి ఆయన మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ తాజాగా ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే సంగీత బిజ్లానీతో అఫైర్ మొదలైంది. ఒక్కసారి సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా హిట్ అయిన తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. శుభలేఖలు కూడా అచ్చు అయ్యాయి. అయితే కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ సంఘటనను ఇటీవల సల్లూ భాయ్ మాజీ ప్రేయసి సోమి ఆలీ వెల్లడించింది.

Sangeeta Bijlani opened about break up with Salman Khan and His Imposition on Clothing Choices in Indian Idol Show

సంగీతా బిజ్లానీతో బ్రేకప్ కారణం గురించి ఇప్పటి వరకు ఎవరూ కామెంట్ చేయలేదు. కానీ సంప్రదాయంగా ఉండే ఆయన కుటుంబంలో సంగీత వ్యవహరించే తీరుపై సల్మాన్ కొన్ని ఆంక్షలు విధించే వారు. ఆ విషయం నచ్చకపోవడం వల్ల సంగీత, సల్మాన్ మధ్య గొడవలు వచ్చాయి. దాంతో వారిద్దరూ విడిపోవాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో వారి సన్నిహితులు పేర్కొన్నారు.

తాజాగా సంగీతా బిజ్లానీ ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కంటెస్టెంట్ ఆమెను ఓ ప్రశ్న అడుగుతూ.. మీరు మీ గతంలో ఎదైనా నిర్ణయం మార్చుకోవాల్సిన అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగితే.. తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌ను అనుకరిస్తూ.. ఆయన నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఏం ధరించాలి? ఎలా ఉండాలనే విషయంలో ఆంక్షలు విధించే వారు. ఆయన పెట్టిన ఆంక్షలను నేను కొంత పాటించాను. అప్పుడు చేసిన పనులను మార్చుకొంటాను అని ఆమె చెప్పారు.

నా మాజీ ప్రియుడితో డేటింగ్‌లో ఉన్న సమయంలో నా వస్త్రధారణపై కండిషన్స్ పెట్టేవారు. ఇలాంటి పొట్టి దుస్తులు వేసుకోవద్దు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి. ఎంత పొడుగు ఉండాలి? ఇలాంటి దుస్తులు వేసుకోవద్దని చెప్పేవాళ్లు. అప్పుడు నేను ఆయన మాటలకు సిగ్గుపడేదానిని. అయితే ఇప్పుడు మాత్రం నేను నా ఇష్టం ఉన్నట్టు దుస్తులు వేసుకొంటాను. ఆయన మాటలు కొంత వరకు విన్నాను. ఇప్పుడు నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. నా జీవితంలో నాకు నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను అని సంగీత బిజ్లానీ చెప్పారు.

సంగీతా బిజ్లాన్ బోల్డుగా తన మాజీ ప్రియుడి గురించి చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. వేదిక మీద ఉన్న మిగితా ఇద్దరు జడ్జీలు షాకింగ్‌గా ముఖాలు పెట్టారు. సంగీత మాట్లాడుతుండగా.. ఒకరి ముఖాలు మరొకరు చూసుకొన్నారు. అయితే ఈ వీడియో ఇన్స్‌టాగ్రామ్‌లో విస్త్రృతంగా చక్కర్లు కొడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X