63 ఏళ్ల వయసులో చెక్కు చెదరని అందం.. సల్మాన్ మాజీ ప్రేయసి.. క్రికెట్ కెప్టెన్ భార్య వీడియో వైరల్

బాలీవుడ్‌లో అందం, అభినయంతో కిరాక్ పుట్టించిన అలనాటి హీరోయిన్లో సంగీతా బిజ్లానీ ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్‌పై ఆమె గ్లామర్, ఆమె నటించిన సినిమాలు హిందీ సినిమా రంగంలోనే కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించి పెట్టాయి. అయితే ప్రొఫెషనల్ జీవితం కంటే.. వ్యక్తిగత జీవితమే ఆమెను మరింత పాపులర్ చేసింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌తో ఆమె ఆఫైర్లు హాట్ టాపిక్‌గా మార్చాయి. అయితే చాలా రోజుల తర్వాత తాజాగా సంగీతా బిజ్లానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 63 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందం ప్రస్తుతం మీడియాలో క్రేజీ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Sangeeta Bijlani Salman Khan

సల్మాన్ ఖాన్‌తో పీకల్లోతు అఫైర్: సంగీత బిజ్లానీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి రాకముందే ఆమెకు ఓ యాడ్ షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ అఫైర్, డేటింగ్ వార్తలతో మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి వరుస హిట్లు కొట్టడం, ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయిన తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. దాంతో పెళ్లి వరకు వచ్చిన వారి డేటింగ్ వ్యవహారం పీటలు ఎక్కుకుండానే బ్రేకప్ అయిపోయింది.

Sangeeta Bijlani Azharuddin

అజారుద్దీన్‌తో వివాహం.. విడాకులు: సల్మాన్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత చాలా రోజులు ఒంటరిగానే ఉండిపోయింది. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌తో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య విడదీయలేని బంధంగా మారిపోయింది. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియాను ఆకర్షించింది. ఆ తర్వాత 1996లో అజర్, సంగీత వివాహం చేసుకొన్నారు. కొన్నాళ్లు సవ్యంగానే వారి వైవాహిక బంధం కొనసాగింది. ఆ తర్వాత పరిష్కరించుకొలేని విభేదాలు వారి మధ్య రావడంతో అజర్, సంగీతా విడాకులు తీసుకొన్నారు.

Sangeeta Bijlani

ప్రైవేట్ ఈవెంట్‌లో మెరిసిన సంగీతా బిజ్లానీ: అజారుద్దీన్‌తో విడాకుల తర్వాత చాలా కాలంగా మీడియాకు, సినీ ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో సంగీతా బిజ్లానీ తళతళమెరిసింది. చెక్కు చెదరని ఆమె లుక్, గ్లామర్, హోయలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. సంగీతా మెయింటెన్ చేస్తున్న గ్లామర్ అభిమానులను కళ్లు తిప్పుకోకుండా చేశాయని నెటిజన్ల కామెంట్ల ద్వారా స్పష్టమైంది.

Sangeeta Bijlani

సంగీతా గ్లామర్ మెరుపుల వెనుక: గ్లామర్ మెరుపులు మెరిపించిన సంగీత బిజ్లానీ.. తన అందచందాల గురించి వెల్లడిస్తూ.. తాను శాఖహారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. పళ్లు, కూరగాయలు, హెల్తీ ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తీసుకొంటాను. బరువు పెరగకుండా ఆహార నియమాలు పాటిస్తాను. రెగ్యులర్‌గా శారీరక వ్యాయమానికి ప్రధాన్యం ఇస్తాను. కార్డియో, మెంటల్ బ్యాలెన్స్ కోసం వర్కవుట్ చేస్తాను. అంతేకాకుండా తగినంత నిద్రపోవడానికి ప్రాధాన్యం ఇస్తాను అని సంగీతా బిజ్లానీ చెప్పింది.

Sangeeta Bijlani

చర్మ సౌందర్యానికి సంగీతా చిట్కాలు: అందం కాపాడుకోవడానికి సరైన చిట్కాలు అనుసరిస్తానని సంగీతా బిజ్లానీ చెబుతూ.. ఎండకు చర్మం పాడైపోకుండా సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ ఉపయోగిస్తాను. తక్కువగా మేకప్ ఉపయోగిస్తాను. శరీరం నిగనిగలాడటానికి ఎక్కువగా వాటర్ తీసుకొంటాను. అల్ట్రా వయోలెట్ కిరణాలు చర్మాన్ని పాడుచేయకుండా సన్ స్క్రీన్ ఉపయోగిస్తాను. బయటకు వచ్చే సమయంలో ఎండ లేకపోయినా సన్ స్క్రీన్ ఉపయోగిస్తాను అని చెప్పింది.

Sangeeta Bijlani

దీపిక పదుకోన్ గురించి సంగీతా: బాలీవుడ్‌లో తాజాగా ఫ్యాషన్ బాగా కనిపించిన చిత్రం పఠాన్ మూవీ నచ్చింది. ఆ సినిమాలో షారుక్, దీపిక పదుకోన్ ధరించిన దుస్తులు చాలా ఫ్యాషనేబుల్‌గా ఉన్నాయి. ఇటీవల కాలంలో నాకు దీపిక పదుకోన్ ఇష్టం అంటూ తెలిపింది. ఇక ముంబైలో జరిగిన ప్రైవేట్ ఈవెంట్‌లో క్లీవేజ్ షోతో అదరగొట్టింది. 63 ఏళ్ల వయసులో కూడా యువ హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామర్‌తో మెరిసిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X