For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలయ్య కొడతారని భయపడ్డా, షూటింగ్ స్పాట్లో ఇద్దరి చెంప చెల్లుమనిపించా: సంఘవి

|

ఒకప్పుడు తన గ్లామర్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊర్రూతలూగించిన వారిలో హీరోయిన్ సంఘవి ఒకరు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఆమె పలువురు అగ్రహీరోలతో నటించారు. ఇప్పటి వరకు 99 చిత్రాల్లో నటించిన ఆమె మంచి కథ అయితేనే 100వ సినిమా చేస్తానని చెప్పారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్రనటుడు బాలయ్య ప్రస్తావన రాగా.... 'సమరసింహారెడ్డి' షూటింగ్ సమయంలో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. బాలయ్యతో ఛాన్స్ వచ్చినపుడు ఆయన గురించి విని భయపడ్డట్లు తెలిపారు.

బాలయ్యను చూడగానే భయం వేసేది

బాలయ్యను చూడగానే భయం వేసేది

బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి సినిమా చేశాను. బి గోపాల్ గారు దర్శకత్వం వహించారు. పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. అప్పట్లో బాలకృష్ణ గారికి చాలా కోపం అని అందరూ అనేవారు. అందుకే ఆయన్ను చూడగానే భయం వేసేది. ఆయన దగ్గరకు వెళ్లినా మాట్లాడకుండా తలదించుకుని సైలెంటుగా కూర్చునేదాన్ని అని సంఘవి గుర్తు చేసుకున్నారు.

నన్ను కొడతారేమో అని భయపడ్డాను

నన్ను కొడతారేమో అని భయపడ్డాను

నేను అలా సైలెంటుగా కూర్చోవడంతో ఒక రోజు వచ్చి ఏంటమ్మా... ఎందుకు ఇలా సైలెంటుగా ఉన్నావు అని అడిగారు. మీరు ఎప్పుడూ చాలా కోపంగా ఉంటారని అందరూ అంటున్నారు. నన్ను కొట్టేస్తారేమో అని భయం, అందుకే అలా ఉన్నాను అన్నాను. లేదమ్మా నేను రోజూ వాకింగ్ వెళ్లి, యోగా చేస్తే నాకు కోపం రాదు అని బాలయ్య చెప్పినట్లు సంఘవి గుర్తు చేసుకున్నారు.

అప్పటి నుంచి బాలయ్యతో సరదాగా ఉండటం మొదలు పెట్టాను

అప్పటి నుంచి బాలయ్యతో సరదాగా ఉండటం మొదలు పెట్టాను

అప్పటి నుంచి తర్వాతి రోజు ఆయన రాగానే... సర్ మీరు ఈ రోజు వాకింగ్ చేశారా? యోగా చేవారా? అని అడిగేదాన్ని, ఖాళీగా ఉంటే కార్డ్స్ ఆడుకుందాం, మాట్లాడుకుందా అనేదాన్ని. ధైర్యంగా వెళ్లి ఆయనతో కూర్చుని మాట్లాడేదాన్ని.... అని సంఘవి గుర్తు చేసుకున్నారు.

ఆ సీన్లో ఆయన్ను కొట్టాల్సి వచ్చింది

ఆ సీన్లో ఆయన్ను కొట్టాల్సి వచ్చింది

బాలయ్యతో చేస్తున్న సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆయన చెంప మీద ఒకటి కొట్టాలి. నేను ఆ పని చేస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారని భయం వేసింది. అది యాక్టింగే కానీ ఫ్యాన్స్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అందుకే భయపడ్డాను. అపుడు బాలకృష్ణ గారు భయపడొద్దు అని ధైర్యం చెప్పారు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ సీన్ చేశాను అన్నారు.

ఆ ఇద్దరి చెంప చెల్లుమనిపించా

ఆ ఇద్దరి చెంప చెల్లుమనిపించా

నాకు షార్ట్ టెంపర్ ఏమీ లేదు. కానీ తెలిసి ఎవరైనా ఏమైనా చేయడానికి వస్తే ఊరుకోను. రెండు సార్లు షూటింగ్ స్పాట్లో ఇద్దరిని కొట్టాను. సింధూరం షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి కావాలని వచ్చి నన్ను తన బుజంతో గుద్దాడు. నాకు కోపం వచ్చి చెంప చెల్లుమనిపించా. పైగా అది మైసూరు దగ్గర షూటింగ్ కావడంతో మా నాన్న ఉన్నారు, మన ఊరు అనే ధైర్యంతో అలా చేశాను. సూర్యవంశం సినిమాలో సమయంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వెంటనే ఒకటిచ్చాను, మా మేకప్ మెన్ కూడా నాలుగు ఇచ్చారు, తర్వాత బండి ఎక్కి వెళ్లిపోయామని అని సంఘవి తెలిపారు.

English summary
Sanghavi interesting comments about Balakrishna. Sangavi is an Indian film actress and former model, known for her works Predominantly in Telugu cinema and Tamil cinema and in few Kannada cinema, Malayalam Cinema and Hindi cinema. In a film career spanning 25 years she was starred in over 80 feature films.ః
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more