ఆరు బయట స్నానం చేస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. సిగ్గు లేదా అంటే ఏమందో తెలుసా?
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల హల్చల్ చేస్తున్నారు. తమకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారో లేక బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా నిలవాలి అనుకుంటారో తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు మలయాళ నటి సానియా అయ్యప్పన్ తను స్నానం చేస్తున్న వీడియో ఒకదానిని షేర్ చేసి చర్చనీయాంశంగా మారింది. అదేంటో చూద్దామా..

డ్యాన్స్ రియాలిటీ షోతో
మలయాళ భామ సానియా అయ్యప్పన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మజావిల్ మనోరమలో డ్యాన్స్ రియాలిటీ షో D2 - D4 డాన్స్‌లో పోటీదారుగా సానియా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ఆ షోలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. సానియా 2014లో బాల్యకళాసఖితో ఇషా తల్వార్ చిన్నప్పటి పాత్రలో నటించి నటిగా అరంగేట్రం చేసింది.

చాలా యాక్టివ్ గా
ఆమె తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం లూసిఫర్‌లో మంజు వారియర్ కుమార్తెగా నటించింది. ఆ తర్వాత ఆమె మమ్ముట్టి నటించిన ది ప్రీస్ట్ చిత్రంలో అతిధి పాత్రలో నటించింది. ఆమె అదే సంవత్సరంలో సురేష్ గోపి కుమార్తెగా 'అపోథెకరీ'లో కూడా నటించింది. అలాగే క్వీన్, లూసిఫర్, ద ఫ్రీస్ట్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ నిత్యం హాట్ ఫోటో షూట్లతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఆమె హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

బికినీలో ఉండి
సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ప్రకృతిలో అంటే ఆరుబయట స్నానం చేసింది. ఆరు బయట పచ్చని మొక్కల దగ్గర బికినీలో ఉన్న ఆమె షవర్ బాత్ చేసింది. స్నానం చేస్తూ ఆమె దీపికా పదుకొనె 'గెహ్రాయాన్' చిత్రంలోని ఓ సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు చాలా మంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆమె నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది అని కొందరు కామెంట్స్ పెడుతుండగా ఓ ఆకతాయి నెటిజన్ మాత్రం సానియా పై మండిపడుతూ వివాదాస్పదంగా కామెంట్ చేశారు.

'సెల్యూట్' మూవీలో
'ఛీ సిగ్గులేదా.. స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తావా.. ఈవ్ టీజింగ్ కేసులు ఇక ఎలా తగ్గుతాయి' అంటూ కామెంట్ చేశాడు. పాపం అతను అంత ఆలోచిస్తూ కామెంట్ చేస్తే సానియా మాత్రం సింపుల్ గా అతనికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. 'అసలు సిగ్గు అంటే ఏంటి' అని అతడిని ప్రశ్నించింది. దీంతో కొంతమంది నెటిజన్లు సానియాకు మద్దతు తెలుపుతుండగా అసలు అలా ఆరుబయట ఎందుకు స్నానం చేస్తున్నావు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు హీరోయిన్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం సిగ్గు లేకనే ఇలా చేస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. కాగా సానియా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన 'సెల్యూట్' మూవీలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











