జైల్లో సంజనా గల్రానీ.. తొలిరోజు ఎలా గడించిందంటే.. కంటతడి పెడుతూ..
బాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీలలో ఒకేసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రియా చక్రవర్తి, రాగిణి ద్వివేది, అలాగే బుజ్జిగాడు సెకండ్ హీరోయిన్ సంజనా గల్రాని పేర్లు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే డ్రగ్స్ వివాదంలో వీరి ముగ్గురిని అరెస్ట్ చేయగా ఓ వర్గం నటీనటుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

మహిళలే కనిపిస్తున్నారా?
డ్రగ్స్ వ్యవహారంలో కేవలం ఈ ముగ్గురు మహిళలు మాత్రమే కనిపిస్తున్నారా క్రీడారంగంలో అలాగే రాజకీయాల రంగంలో కూడా డ్రగ్స్ వాడకం గట్టిగానే ఉంది వారిని కూడా పట్టుకోవాలని నటీమణి పారుల్ యాదవ్ ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బుధవారం సంజనాను కస్టడీలోకి తీసుకొని అధికారులు అనేక విషయాలపై విచారణ జరిపారు.

తీవ్ర మానసిక ఒత్తిడి..
డ్రగ్స్ కేసులో సంజనా గల్రాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనబోతోందని అర్ధమవుతోంది. అయితే ఇటీవల రాగిణి ద్వివేదితో పాటు సంజనా గల్రానిని కూడా బెంగళూరు డైరీ సర్కిల్‌లోని మహిళా సాంత్వన కేంద్రంలో ఉంచారు. వీరిద్దరూ కూడా కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

నా కర్మ అంటూ సంజాన కన్నీటి పర్యంతం
మంగళవారం రాత్రి ఒకే గదిని కేటాయించగా వారి బెడ్స్ మధ్య మహిళా కానిస్టేబుళ్లను కూడా ఉంచారు. భోజనం కూడా వద్దని చెప్పిన సంజనా బాధతో ఇదంతా నా కర్మ అంటూ కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక ఆమె పక్కనే రాగిణి ఉన్నా కూడా మాట్లాడలేదట. గతంలో ఇద్దరికి కేపీఎల్‌లో గొడవ జరిగినట్లు టాక్ వస్తోంది. అప్పటినుంచే మాటలు లేవట.
Recommended Video

సంజనా బయటపెట్టిన పేర్లు
బుధవారం 10 గంటలకు సంజనాను సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయానికి తీసుకువచ్చి, మహిళా సీఐ అంజుమాల టీమ్ తో ఇన్వెస్టిగేషన్ చేయించారు.ఇక విచారణలో దాదాపు 34 మంది బడా బాబుల పుత్రుల పేర్లను కూడా సంజనా బయటపెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సీబీఐ కేసు విషయంలో మరో అడుగు ముందుకి వేయాల్సిందే.


Click it and Unblock the Notifications











