వరలక్ష్మీ శరత్ కుమార్‌కి డైరెక్టర్ క్షమాపణలు.. సత్యం గెలుస్తుందంటూ నటి పోస్ట్

తమిళ నటి వరలక్ష్మీపై టాలీవుడ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వరలక్ష్మీ, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన పోలీస్ కంప్లైంట్ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వరలక్ష్మీపై సంజీవ్ సంచలన ఆరోపణలు చేశారు. వరలక్ష్మీ డబ్బులు తీసుకుని ప్రమోషన్స్‌కి రావడం లేదని, 3 నెలల పాటు డబ్బింగ్ చెప్పకుండా తనను ఏడిపించిందని, చివరికి అడుకున్నా ఆమె కనికరించలేదని చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. 24 గంటలు గడిచిలోగా.. ఈ వివాదానికి చెక్ పడింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌కు సంజీవ్ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

నమస్కారం.. సంజీవ్ మేగోటి. పోలీస్ కంప్లైంట్ సినిమా దర్శకుడిని. మా సినిమా హీరోయిన్ వరలక్ష్మీ గారు. నిజానికి వరలక్ష్మీ గారి కోసమే ఈ కథ తయారు చేసుకున్నాం. ఆమెతోనే ట్రావెల్ అయ్యాం. ఆవిడతో నాకు షూటింగ్‌లో కానీ, స్క్రిప్ట్‌లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిచిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్‌లా తిరిగేవారు.. నన్ను కూడా బ్రదర్‌లా షూటింగ్‌కి సహకరించారు. తను చేతికి గాయమైనా కూడా కట్టు కట్టుకుని వచ్చి యాక్ట్ చేశారు. సినిమాకి, నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగకూడదని మాకు సపోర్ట్ చేశారు. కాకపోతే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేం అనుకున్న జూన్ 12న రిలీజ్ చేస్తున్న సందర్భంలో వరలక్ష్మీ గారు దొరక్కపోవడం.. అలాగే లేట్ అవ్వడం వల్ల ఒక ప్రెస్‌మీట్ ఆమెతో కలిసి పెట్టాలని అనుకున్నాం. కాకపోతే అది కుదరలేదు.. సినిమా రిలీజ్‌కు ముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా అడుగుతున్నారు అని సంజీవ్ అన్నారు.

Sanjeev Megoti Apologizes to Varalaxmi Sarathkumar After Controversial Comments

ఆ టైంలో సినిమా గురించి నేను మాట్లాడుతూ.. అనుకోకుండా ఈ ప్రోమోషన్స్.. మా హీరోయిన్, అంతకుముందు చాలా కోపరేట్ చేసిన వరలక్ష్మీ గారి గురించి తప్పుగా గానీ, వల్గర్‌గా గానీ ఏం మాట్లాడలేదు. కొన్ని మాటలు దొర్లాయి.. అది కూడా బాధలోనే. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ రకరకాల టెన్షన్ ఉంటాయి. అయితే పదో తారీఖున ప్రెస్‌మీట్‌లో వరలక్ష్మీ గారి గురించి కొన్ని అనుకోని మాటలు దొర్లాయి. వాటికి, ప్రేక్షకులు, పత్రికా ముఖంగా నేను వరలక్ష్మీ గారికి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆవిడతో నాకు మంచి బాండింగ్ ఉంది. కానీ ఆ చిన్న మాట వల్ల ఆవిడ ఫీల్ అవ్వడం, నేను కూడా హర్ట్ అవ్వడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది ఫోన్ చేశారు. మీరు ఎప్పుడూ అలా మాట దొర్లింది లేదు.. ఇలాంటి మాట్లాడారేంటీ అని అడిగారు అని సంజీవ్ చెప్పారు.

నేను హర్ట్ చేయను, మీ ప్రొడక్షన్ కంపెనీలో ఏమైనా మేడంని హర్ట్ చేశారా అని అడిగారు. ఆవిడ ఎప్పుడూ ఏ సినిమాకి ఇబ్బంది పెట్టలేదు. సినిమా షూటింగ్ కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ ఇబ్బంది పెట్టలేదు. మీరెందుకు అలా మాట్లాడారు అని ప్రశ్నించారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదం.. ఇది మరోసారి జరగదు. జూన్ 12న పోలీస్ కంప్లైంట్ మూవీ వస్తోంది. ఈ తప్పులన్నీ మరిచిపోయి సినిమాను ఆదరించండి.. వరలక్ష్మీ గారికి మరోసారి సారీ చెప్పారు సంజీవ్.

నేను చేసిన సినిమాల్లో ఇంత వరకు ఈ స్థాయిలో రిలీజ్ లేదు.. తెలుగులో 300 థియేటర్లు, కన్నడంలో 100కి పైగా థియేటర్‌లలో రిలీజ్ అవుతోంది. ప్రొడ్యూసర్లే డబ్బులు ఎదురుపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్న పరిస్ధితుల్లో.. సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూటర్లు అందరికీ సినిమాను చూపించి మరి రిలీజ్ చేస్తున్నాం. వాళ్లకు నచ్చి ఈ సినిమా మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుడిని ఎలాంటి నిరాశపరచదు. చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేసిన వరలక్ష్మీ గారిని చాలా కొత్తగా చూస్తారు. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అలాగే పోలీస్ కంప్లయంట్ మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని సంజీవ్ అన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజీవ్ మేగోటి క్షమాపణలపై వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. సారీ యాక్సెప్టెడ్. న్యాయం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తాయి. ఈ వివాదంలో వేగంగా స్పందించినందుకు తెలుగు నిర్మాతల మండలికి వరలక్ష్మీ శరత్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయ్యింది. ఈ కాంట్రవర్సీ కారణంగా పోలీస్ కంప్లైంట్ మూవీపై బజ్ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X