twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్ సైకో, శాడిస్టు: సంజన.. ఎందుకు కన్నానని మా నాన్న ఫీల్.. అఫైర్లు కామన్!

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంజన గర్లానీ అందరికీ సుపరిచితమే. తెలుగులో బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా అచితూచీ సినిమాలను చేస్తున్నది. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ సినిమా చేసేటప్పుడు ఈ పరిశ్రమలోకి ఎందుకు వచ్చాననే బాధ కలిగింది అని సంజన చెప్పారు. అదేమిటంటే..

    17 ఏళ్ల వయసులోనే

    17 ఏళ్ల వయసులోనే

    నా 17 ఏళ్ల వయసులో నేను తొలి సినిమా చేశాను. అప్పటికే నేను మోడలింగ్ చేస్తున్నాను. బైక్‌పై తిరగడం ఇష్టం లేక సినిమా చేస్తే కారులో తిరుగవచ్చని సినిమా ఒప్పుకొన్నాను. అదే గండ హెందర్తి (మర్డర్2 సినిమా రీమేక్). ఆ సినిమా చేసేటప్పుడు మున్ముందు కష్టాలు పడుతానని ఆలోచించలేదు అని చెప్పారు.

    ముద్దు సీన్లను చాలా తేలికగా

    ముద్దు సీన్లను చాలా తేలికగా

    నా తొలి సినిమాలో ముద్దు సీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అప్పటికే నా ఫ్రెండ్స్‌కు అఫైర్లు ఉన్నాయి. 12 స్టాండర్డ్‌లో అఫైర్లు కామన్ అని తెలుసు. నా ఫ్రెండ్స్ ముద్దులు పెట్టుకోవడం గురించి చెప్పడం విన్నాను. ముద్దు సీన్లే కాదా అని తేలికగా తీసుకొన్నాను. కెమెరా ముందే కదా అని వృత్తిలో భాగంగా ఒప్పుకొన్నాను.

    మా నాన్న బాధ చూసిన తర్వాత

    మా నాన్న బాధ చూసిన తర్వాత

    నా మొదటి సినిమా రిలీజ్ తర్వాత నా తల్లిదండ్రులతో నేను సినిమా చూశాను. అప్పుడు మా నాన్న పడిన బాధ చూసి ఆవేదనకు గురయ్యాను. ఎందుకు కన్నాననే ఫీలింగ్ మా నాన్నకు కలిగింది. అలాంటి సమయంలో ఈ సినిమాలు ఎందుకు చేయాలనే ఫీలింగ్ కలిగింది. 2 లక్షల పారితోషికం గురించి ఇలాంటి పరిస్థితి అవసరమా అనిపించింది.

     ఆ డైరెక్టర్ బెదిరించాడు

    ఆ డైరెక్టర్ బెదిరించాడు

    అదే కాకుండా, ఆ సినిమా షూటింగ్‌లో దర్శకుడు నా పట్ల ప్రవర్తించిన తీరు నాకు చాలా బాధకలిగింది. నా కెరీర్‌లో అతనొక్కడే నాకు ఇష్టం లేని డైరెక్టర్. డబ్బు వాపస్ ఇచ్చి సినిమా నుంచి తప్పుకోవాలనుకొన్నాను. అదే విషయాన్ని చెబితే వాళ్లు బెదిరించారు. పేపర్లో వేయిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

    నా తొలి సినిమా డైరెక్టర్ సైకో, శాడిస్ట్

    నా తొలి సినిమా డైరెక్టర్ సైకో, శాడిస్ట్

    అదే మర్డర్ సినిమా రీమేక్ షూటింగ్‌లో బ్యాకాంక్‌లో జరిగింది. చాలా తక్కువ వెడల్పు ఉన్న రాయిపై నడిపించాడు. స్లిప్ అయితే డైరెక్టుగా నదిలో పడే పరిస్థితి. అలానే బెదిరిస్తూ నడిపించాడు. కన్నడ భాష రాదని నాపై దుర్భాషలాడాడు. అతనో సైకో, శాడిస్టు డైరెక్టర్. అలా నాకు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో మళ్లీ సినిమాల్లో నటించవద్దని అనుకొన్నారు.

    <strong>నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ త్వరలో బయటకొస్తాయి: శ్రీరెడ్డి కామెంట్స్ ఎవరిపై?</strong>నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ త్వరలో బయటకొస్తాయి: శ్రీరెడ్డి కామెంట్స్ ఎవరిపై?

    నా ఫ్రెండ్స్ నాకు దూరంగా

    నా ఫ్రెండ్స్ నాకు దూరంగా

    సినిమా రిలీజ్ తర్వాత నా ముద్దు సీన్లు చూసి నా స్నేహితులు ఈసడించుకొన్నారు. నాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేశారు. దాంతో ఓ దశలో కోపం వచ్చి నీవు ముగ్గురు, నలుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేశావు అంటూ వారిపై అరిచాను. స్క్రీన్ పై ముద్దు పడితే తప్పా అంటూ వారితో గొడవపడ్డాను. అలా నా మొదటి సినిమానే చాలా గందరగోళానికి గురిచేసింది.

    English summary
    Archana Galrani better known by her stage name Sanjjanaa Galrani, is an Indian model and film actress. She made her film debut in the Tamil-Telugu bilingual film Oru Kadhal Seiveer, and soon known for her controversial role in the Kannada film Ganda Hendathi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X