గల్రానీ సిస్టర్స్ వరుస గుడ్ న్యూస్.. మొన్న పెళ్లి నేడు బిడ్డ

గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుకు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి వివాహం చేసుకున్న సంజనా గల్రానీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.. కంగ్రాచ్యులేషన్స్ మీకు బేబీ బాయ్ జన్మించినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం తో ఈ విషయం మీడియా దాకా చేరింది.. నిజానికి గతంలో బుజ్జిగాడు, సత్యమేవ జయతే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంజనా ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమకే పరిమితం అయింది.

ఆ మధ్య రాగిణి ద్వివేది తో కలిసి డ్రగ్స్ కేసులో జైలు జీవితం గడిపిన ఆమె బయటకు రాగానే తన ప్రియుడు పాషాను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ సమయంలో మతమార్పిడి జరిగింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి గానీ తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను అని ఆమె ప్రకటించింది. ఇక మరోపక్క సంజన సోదరీ నిక్కీ కొద్ది రోజుల క్రితమే ఆది పినిశెట్టిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అక్క బాటలోనే సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిక్కీ త్వరిత గతిన హీరోయిన్గా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఆది పినిశెట్టితో వరుసగా రెండు సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి స్నేహం మొదలై అది ప్రేమకు దారి తీసింది.

Sanjjanaa Galrani gave birth to a baby boy

మే 18వ తేదీన చెన్నైలోని లీలా పాలస్ లో అంగరంగ వైభవంగా ఆది పినిశెట్టి నిక్కీ వివాహం జరిగింది. రోజుల వ్యవధిలోనే ఒకపక్క అక్క తల్లి కావడం మరొక చెల్లి వివాహం కావడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంజన కన్నడ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోగా ఆమె సోదరి మాత్రం తమిళ, తెలుగు సినిమాలలో ప్రయత్నాలు చేసింది. ఆది పినిశెట్టి హీరోగా మలుపు సినిమా విడుదలై తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా లో మొట్టమొదటి సారి వీరిద్దరూ కలిసి నటించారు.. తర్వాత మరకతమణి అనే సినిమాలో కూడా విడుదల కలిసి నటించారు. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది అప్పట్లోనే మీడియాలో కథనాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X