మీర్జాపూర్ లాంటి కథతో ప్యాన్ ఇండియా సినిమా… అలాంటి పాత్రలో కనిపించనున్న సంజనా!
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజనా గల్రానీ ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో చేసినా పెద్ద క్రేజ్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. అయితే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం మంచి సినిమాలు చేస్తూ ఈ భామ పేరు తెచ్చుకుంది. అయితే తాను మీర్జాపూర్ సిరీస్ లాంటి కథనం ఒక సినిమాలో నటిస్తున్నానని ఆ భామ తాజాగా వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

లక్కు కలిసి రాలేదు
కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంటర్ అయిన సంజన అక్కడ కలిసి రాకపోవడంతో తెలుగు సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. అలా ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు లక్కు మాత్రం కలిసి రాలేదు.

జైలుకు కూడా
గత ఏడాది నుంచి అనేక వివాదాల్లో చిక్కుకుని ఏకంగా డ్రగ్స్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి చూస్తోంది. అలా తాజా ఇంటర్వ్యూలో తాను ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నానని వివరాలు వెల్లడించింది. మణిశంకర్ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు సంజన వెల్లడించింది. అంతే కాదు ఈ సినిమాలో తన రోల్ ఒక రేంజ్ లో ఉండనుందని వెల్లడించింది.

అందరికీ దక్కవు
ఈ సినిమాతో దర్శకుడిగా జి వెంకట కృష్ణ వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చిన ఆమె ముందు నుంచి కూడా తాను నటించే సినిమా ఎప్పుడు తన పాత్ర చుట్టూ తిరిగేలా ఉంటే బాగుండును అని అనిపిస్తూ ఉంటుందని ఒక నటిగా తనకు అది పెద్ద కోరిక అని చెప్పుకొచ్చింది.. అయితే అందరికీ అలాంటి అవకాశాలు దక్కవు కానీ తనకు మాత్రం ఈ సినిమా ద్వారా దక్కుతుందని చెప్పుకొచ్చింది.

ఆ సిరీస్ ఫార్మాట్ లో
ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నామని పేర్కొన్న ఆమె ఈ సినిమా పూర్తిగా మీర్జాపూర్ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ ఫార్మాట్ లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూర్లలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చింది. అంతే కాదు తాను ఈ సినిమా కోసం పూర్తిగా లుక్ కూడా చేంజ్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.

ప్రేమ పెళ్లి
డ్రగ్స్ కేసు వ్యవహారంలో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చిన ఈ భామ బయటకు వచ్చిన వెంటనే తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే అప్పుడు కూడా ఈ అంశం రచ్చ రేపింది. అయితే ఈ విషయం మీద సంజన మాత్రం క్లారిటీగానే ఉంది. తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతోంది.


Click it and Unblock the Notifications











