ఆ రూమర్ల వల్లే విరాట్ కోహ్లితో బ్రేకప్.. రిలేషన్‌షిప్ గురించి సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దక్షిణాది భాషలలో నటించి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు సంజన గల్రానీ. పెళ్లి చేసుకుని స్థిరపడటంతో పాటు శాండిల్‌వుడ్ డ్రగ్స్ స్కామ్‌లో ఆమె పేరు కూడా బయటకు వచ్చింది. అలా సినిమాలు, వివాదాలతో పాపులర్ అయ్యింది సంజన. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంజనకు బాగానే పాపులారిటీ ఉంది. ప్రభాస్ సరసన బుజ్జిగాడుతో పాటు మరికొన్ని సినిమాలలో సంజన నటించారు. అయితే సినిమాలు లేకపోవడంతో కొంతకాలం తెలుగు ప్రేక్షకులు ఆమెను మరిచిపోయారు.
సంజన చుట్టూ బిగ్‌బాస్ తెలుగు 9
ఈ పరిస్ధితుల్లో బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చింది సంజన. సాధారణంగా పెద్ద వయసు వారు, అందులోనూ మహిళలు ఎక్కువ రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న దాఖలాలు లేవు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న విశ్లేషకులు.. సంజన కూడా ఎక్కువ రోజులు బిగ్‌బాస్‌లో ఉండదని భావించారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ బిగ్‌బాస్ షోను కొన్ని వారాల పాటు తన చుట్టూ తిప్పుకున్నారు సంజన. గుడ్డు దొంగతనంతో మొదలైన సంజన స్ట్రాటజీలు రకరకాలుగా సాగి.. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు తొలి కెప్టెన్‌ని చేశాయి.

టాప్ 5లో సంజనకు చోటు
మధ్యలో బిగ్‌బాస్ నుంచి సంజన ఎలిమినేట్ కావడంతో ఆమె కథ క్లోజ్ అని అంతా అనుకున్నారు. కానీ పరిస్ధితులు మాత్రం పూర్తిగా సంజన చేతుల్లోనే ఉన్నాయి. రెండ్రోజులకే బిగ్‌బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి.. నాటి నుంచి 15 వారాల పాటు అప్రతిహతంగా జర్నీ సాగించింది. టాప్ 5లో నిలిచి తనూజ, కళ్యాణ్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే చివరిలో ఓటింగ్ తేడా రావడంతో సంజన రేసులో వెనుకబడి ఫోర్త్ రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్‌లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో జట్టు కట్టి.. సొంత కొడుకులా చూసుకున్నారు. బయటికి వచ్చాక కూడా ఇమ్మూతో సంజన అలాగే వ్యవహరిస్తున్నారు.
విరాట్ కోహ్లీతో సంజన ప్రేమాయణం?
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సంజనకు సంబంధించిన చాలా పాత విషయాలు, వీడియోలు, వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అందులో టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో క్లోజ్‌గా ఉన్న ఫోటో కూడా ఉంది. దాంతో కోహ్లీతో సంజన ప్రేమాయణం సాగించింది అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఆశ్చర్యకరంగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా సంజన- కోహ్లీల రిలేషన్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీతో తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంజన.
వాళ్ల వల్లే విడిపోయాం
అవన్నీ గతం.. ఆ టైంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్తగా వచ్చింది. నేను స్వతహాగా బెంగళూరు అమ్మాయిని, సినీనటిని కావడంతో ఆ టీమ్‌కి మద్ధతుగా ఉండేదానిని. ఓ రోజున ఆర్సీబీ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌కు గెస్ట్‌గా వెళ్లాను. విరాట్ కోహ్లీతో ఫ్రెండ్‌షిప్పే తప్ప వేరే ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రూమర్సే మా ఇద్దరి మధ్య జెన్యూన్ ఫ్రెండ్‌షిప్‌ని చెడగొట్టింది. ఈ రూమర్స్ కనుక రాకపోయుంటే ఇప్పటికీ కోహ్లీ నేను మంచి మిత్రులుగా ఉండేవాళ్లం. ఈ లేనిపోని ప్రచారం, రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. నేను నిజాయితీ గల అమ్మాయిని.. నాకు అలాంటి ప్రచారం అక్కర్లేదు. విరాట్ కోహ్లీకి గర్ల్‌ఫ్రెండ్ అన్న గుర్తింపు నాకు అక్కర్లేదు. నా ఫ్యామిలీతో పాటు కోహ్లీని, ఆయన కుటుంబాన్ని గౌరవిస్తా. ఈ రూమర్స్ మా ఫ్రెండ్‌షిప్‌ను చెడగొట్టాయనే బాధ ఎప్పటికీ ఉంది అని సంజన గల్రానీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సంజన ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











