సీక్రెట్ ప్లేస్‌లో ప్రియుడి పేరుతో టాటూ.. 15 ఏళ్లు కనిపించకుండా.. అతడే నా భర్త అంటూ హీరోయిన్ క్లారిటీ

సినీతారలకు ఒంటిపై ఎవరికి కనిపించకుండా టాటూలు వేసుకోవడం అందరికి తెలిసిందే. అయితే సీక్రెట్ ప్లేస్‌లో కనిపించకుండా టాటూ వేసుకొన్న దక్షిణాది ముద్దుగుమ్మ సంజన గల్రానీ తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఆ టాటూ తనకు ఎంత ఇష్టమో అనే విషయాన్ని సుదీర్గమైన పోస్టుతో వెల్లడించింది. సీక్రెట్ ప్లేస్‌లో ఉన్న టాటూను మీకు చూపించాలని అనుకొంటున్నాను. నా హృదయానికి, నాకు చాలా వ్యక్తిగతం, ప్రాణం కన్నా ఎక్కువైంది. ఇనాళ్లు ఎవరికి కనిపించకుండా దాచిపెట్టాను. ఎందుకంటే నా లవ్‌ను సీక్రెట్‌గా పెట్టాలని అనుకొన్నాను. అందుకు కారణం ఎలాంటి గాసిప్స్, రూమర్లు రాకుండా ఉండటానికే ఈ సీక్రెట్‌ను మెయింటెన్ చేశాను అని సంజనా గల్రానీ తెలిపారు.

Sanjjanaa Galrani reveals her secret tattoo about her man and Love Azeez

ఇప్పుడు నా ప్రియుడితో పెళ్లి జరిగిపోయింది కనుక నాకు సీక్రెట్ టాటూ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తున్నాను. ఈ టాటూ, నా ప్రియుడు నాకు మానసికంగా స్థైర్యం అంటూ సంజనా గల్రానీ ఎమోషనల్ అయ్యారు. నేను నటిని కావడం వల్ల నాపై ఎన్నో ఆరోపణలతో లింకులు, ఎందరో పురుషులతో లింకులు ఉన్నాయంటూ గాసిప్స్ నన్ను కొన్నిసార్లు మానసికంగా గాయపరిచాయి. నా సన్నిహితులతో రెండు మూడుసార్లు కనిపిస్తే చాలా రిలేషన్స్ అంటగట్టారు. చాలా సార్లు బాధను అనుభవంచాను. నా రాఖీ బ్రదర్‌తో కూడా సంబంధాన్ని అంటగట్టారు. నా బ్రదర్ అనే విషయాన్ని పట్టించుకోకుండా బాయ్‌ఫ్రెండ్స్ అంటూ రాతలు రాస్తే.. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను అని తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

Sanjjanaa Galrani reveals her secret tattoo about her man and Love Azeez

నా స్నేహితుడు లేదా శ్రేయోభిలాషుల, ప్రముఖ నటుడు, లేదా రాజకీయవేత్త లేదా క్రికెటర్‌ అనే తేడా లేకుండా.. స్నేహం అనే విషయాన్ని మరిచి కోడూ 1000 రకాల స్టోరీలు, కట్టుకథలు అల్లారు. వాటిని చూసి కుంచిత స్వభావం అని బాధపడ్డాను. చీప్ ఆలోచనతో రిలేషన్స్‌షిప్‌ను అంటగట్టే ప్రయత్నం చేశారు. 20021లో ఉన్నా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మానుకోరా అనిపించేది. ఇలాంటి విషయాల మధ్య నా మనిషి.. అత్యంత ఇష్టమైన ప్రేమించే వ్యక్తి ఎవరో కాదు.. లవ్ యూ అజీజ్ అంటూ సంజనా గల్రానీ భావోద్వేగానికి లోనైంది. 15 ఏళ్లుగా ఎవరికి కనిపించకుండా అజీజ్ అంటూ తన నిజమైన స్నేహితుడు, లవర్, ప్రస్తుతం నా భార్త, నాకు తండ్రి లాంటి మెంటర్ అంటూ అజీజ్ గురించి నిజాలను బయటపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X