హీరోయిన్ సంజనకు సర్జరీ.. అందుకే నెల నుంచి!
హీరోయిన్ సంజనకు సర్జరీ జరిగింది. తన అండాశయంలో ప్రమాదకరంగా పెరిగిన 550 ఎమ్ఎమ్ డెర్మాయిడ్ ని వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారని సంజన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆసుపత్రిలో బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న చిత్రాలని సంజన పోస్ట్ చేసింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బావుందని అభిమానులకు తెలిపింది.
ఆపరేషన్ జరగడం వలనే తాను నెలరోజుల నుంచి బయటకు రావడం లేదని సంజన తెలిపింది. ఆరోగ్యం శ్రద్ద లేకపోతే ఇలాంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రతి మహిళ 6 నెలలకు ఒకసారి అయినా అండాశయం, గర్భాశయాలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సంజన సూచించింది. ప్రభాస్ బుజ్జిగాడు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళ భాషల్లో సంజన పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల సంజన బుల్లి తెరపై కూడా ప్రవేశించింది. స్వర్ణ ఖడ్గం అనే టీవీ సీరియల్ లో నటిస్తోంది. బుజ్జిగాడు, దండుపాళ్యం 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నటించింది. మీటూ ఉద్యమం సందర్భంగా కూడా సంజన వార్తల్లో నిలిచింది. ఓ కన్నడ దర్శకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సినిమాలో కేవలం ఒక ముద్దు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత 30 ముద్దులు పెట్టించారని, లైంగికంగా వేధించారని సంజన ఆరోపించింది.


Click it and Unblock the Notifications











