ఆఫర్ల కోసం దానిని కోల్పోవద్దు.. సమంత, రష్మికలా కాకుండా.. మీనాక్షి చౌదరీ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గతేడాది నుంచి వరుస విజయాలు సొంతం చేసుకొంటూ టాలీవుడ్‌కు అదృష్ట రేఖగా మారిపోయింది. ప్రస్తుతం టాప్ తెలుగు హీరోయిన్‌గా ప్రశంసలు అందుకొంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న సమయంలో ఆమె తనలోని భావాలను మీడియాతో పంచుకొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

సినిమా పరిశ్రమలోకి రావాలనుకొనే యువతులకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే.. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. మీరు కెరీర్‌లో ముందుకెళ్లాలనుకొనే సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు తలవొగ్గకూడదు. మీ ఒరిజినాలిటీ మిస్ కాకుండా ఉండాలి. సోషల్ మీడియా కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని మీనాక్షి చౌదరీ అన్నారు.

Sankarthiki Vastunnam Fame Meenakshi Chaudhary advice not to loose your personality in the Industry

ఇండస్ట్రీలో ఎదుగాలనే ప్రయత్నంలో మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండాలి. పరిస్థితులకనుగుణంగా మారితో మీ వ్యక్తిత్వం దెబ్బ తింటుంది. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం మనగడ సాధించాలంటే.. మీ పర్సనాలిటీని చంపుకోవద్దు. మనం ఒక విషయాన్ని బలంగా నమ్ముతాం. దానిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అని ఆమె అన్నారు.

హీరోయిన్ల అనగాన రకరకాల అభిప్రాయాలు, అంచనాలు ఉంటాయి. వాటి కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణాది హీరోయిన్లంటే లావుగా ఉంటారనే అపోహాలు ఉంటాయి. అలాంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండాలి. బాలీవుడ్‌లో ఒకప్పుడు కొన్ని పరిమితులు, ఆంక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు అని అన్నారు.

Sankarthiki Vastunnam Fame Meenakshi Chaudhary advice not to loose your personality in the Industry

సినిమా రంగంలో దీపిక పదుకోన్, ఆలియా భట్, కియారా అద్వానీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు. వారందరూ ఎవరికి వారే తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు. అలాగే సమంత, సాయి పల్లవి, రష్మిక మందన్న కూడా తమకంటూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు అని మీనాక్షి చౌదరీ అన్నారు.

లక్కీ భాస్కర్, మట్కా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు నాలోని ప్రతిభను నిరూపించుకొనేందుకు ఉపయోగపడ్డాయి. సినిమా పరిశ్రమలో మనగడ కోసం నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నా కంటూ ఓ గుర్తింపును తెచ్చుకొన్నాను. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాను. ఇప్పుడు వాటి గురించి మాట్లాడలేను. కానీ త్వరలోనే వాటి గురించి అఫీషియల్‌గా వెల్లడిస్తాను అని మీనాక్షి చెప్పింది.

More from Filmibeat

Read more about: meenakshi chaudhary tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X