దారుణంగా వరుస బ్రేకప్స్.. అలాంటి హింసకు గురయ్యా.. ఐశ్వర్య రాజేశ్
తెలుగు సినిమా ప్రపంచంలో తన టాలెంట్, గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ పేరు మార్మోగుతున్నది. గతంలో ఎన్ని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించాలనుకొన్న ఈ అందాల భామ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆ పనిని పూర్తి చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను ప్రేక్షకులతో పంచుకొనే ప్రయత్నం చేసింది. ఐశ్వర్య రాజేశ్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన నటిగా ఐశ్వర్య రాజేశ్ గుర్తింపు తెచ్చుకొన్నది. తమిళ సినిమా రంగంలో భావోద్వేగమైన పాత్రలతో తన టాలెంట్ ఏమిటో రుచి చూపించింది. అచ్చ తెనుగు అమ్మాయి అయినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇటీవల సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ కోసం చేసిన ప్రమోషన్స్‌లో చలాకీతనంతో ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకొన్నది. తనదైన శైలిలో మాట్లాడుతూ తెలుగు అభిమానులను భారీగా సంపాదించుకొన్నది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‌లో భారీగా ఆఫర్లను అందుకొంటున్నట్టు తెలిసింది. తెలుగులో మంచి అవకాశాలను ఎంచుకొంటున్నట్టు తెలుస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లో తన వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ భావోద్వేగానికి గురైంది. నా జీవితంలో చాలా దారుణమైన రిలేషన్‌షిప్స్ పెట్టుకొన్నాను. ఆ అఫైర్ల వల్ల నేను చాలా కోల్పోయాను. విషపూరితమైన రిలేషన్స్ ఒకటి తర్వాత ఒకటి బ్రేకప్ అయ్యాయి. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా నేను హింసకు గురయ్యాను. అలాంటి పరిస్థితులను దాటుకొంటూ నేను ప్రస్తుతం ఎలాంటి బంధాలు పెట్టుకోకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాను అని ఐశ్వర్య రాజేశ్ చెప్పారు.

అయితే నా పెళ్లి గురించి నాకు సరైన అవగాహన ప్రస్తుతం లేదు. నేను పెళ్లి చేసుకొంటానా? లేదా? చేసుకొంటే ఎప్పుడు చేసుకొంటానో నాకే తెలియదు. అందుకే పిల్లల్ని కనడం కోసం నా సంతానోత్పత్తి కణాలను భద్రపరుచుకొన్నాను. సంతానం కావాలనుకొన్న సమయంలో వాటిని ఉపయోగించుకొంటాను అని ఐశ్వర్యరాజేశ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











