అతడు ఒప్పుకొంటే పెళ్లి చేసుకుంటా.. ఐశ్వర్య రాజేష్ మనసుపడ్డ హీరో ఎవరో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాశేష్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితురాలే. ఆమె బేసిక్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. కోలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాల్లో నటించింది. తమిళులకు బాగా పరిచమవడమే కాకుండా అక్కడి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన నటన, సింపుల్లిసిటీతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. అభిమానులు మెచ్చే సినిమాలే కాకుండా ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఆమె సినిమాలు వస్తున్నాయి. కొత్తదనాన్ని చూపించడంలో ఆమె దిట్ట అనే చెప్పాలి.

ఇదిలా... ఐశ్వర్య రాజేష్ తాజాగా నటించిన తెలుగు చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. హీరో దగ్గుబాటి వెంకటేష్ లీడ్ గా నటించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ తో పాటు మరో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిలు ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ గా దుమ్ములేపారు. ఈ తరం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. దీంతో ఎన్నో ఎళ్లుగా తెలుగులో సరైన హిట్ కోసం ఎదరుచూస్తున్న ఐశ్వర్య రాజేష్ కు ఈ చిత్రం ఇప్పుడు అస్త్రంలా మారింది.

Sankranthiki Vasthunam Heroine Aishwarya Rajesh Interesting Comments

సంక్రాంతికి వస్తున్నాం.. చిత్రం దాదాపు నెలరోజులుగా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దానికి తోడు ఈ మూవీ టీమ్ కూడా ఇంకా ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేందుకు ప్రమోషన్స్ ను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో లేటేస్ట్ గా అనిల్ రావిపూడి, వెంకీ, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో యాంకర్ సుమ ఓ చిట్ చాట్ నిర్వహించారు. ఈ మీట్ లో సుమ మాటలకు మౌనమే ఇప్పుడు ఆ హీరో ఎంతటి ప్రేమ, అభిమానం ఉందో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిగ్ స్క్రీన్ పై వారి జంట కూడా చూడముచ్చటగా కనిపించడంతో ఐశ్వర్య రాజేష్ మనసు పడ్డ హీరో అతనే అని కూడా అంటున్నారు.

అయితే.. వెంకీ వైఫ్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చింది. వెంకటేశ్ కు చక్కటి జంటగా కనిపించింది. అయితే సుమ.. వెంకటేష్ పెళ్లాలు అంటూ నోరుజారింది. దాన్ని ఐశ్యర్య రాజేష్ ఖండించకపోవడమే కాకుండా.. మౌనంగా నవ్వుతూ ఉండింది. తర్వాత అంతా గమనిస్తూ ఉన్నాను.. మీరు మాట్లాడేది అంటూ ఫన్నీగా బదులిచ్చింది. మరోవైపు లైవ్ లోనే బావ, లవ్ యూ అంటూ సినిమాలోని డైలాగ్స్ ను నొక్కి చెబుతూ ఆకట్టుకుంది. అయితే ఇంకా ఐశ్వర్య రాజేష్ వెంకీ వైఫ్ పాత్రలోనే జీవిస్తున్నట్టు కనిపించడం ఆసక్తికరంగా మారింది. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా.. అనేలా తన తీరు కనిపించిందంటున్నారు.

ఈ వీడియోతో ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్న ఐశ్వర్య రాజేష్ మనసుపడ్డ హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ మార్క్ లేకుండా, కేవలం టాలెంట్ ను నమ్ముకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తన సినిమాల్లో పెర్ఫామెన్స్ మాదిరిగానే.. ఎంతో సరదాగా కనిపిస్తూనే ముక్కుసూటిగానూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక తమిళం, తెలుగు ఆడియెన్స్ లో ఐశ్వర్యకు మంచి గుర్తింపు ఉండటం విశేషం. ఆమె మరిన్ని సినిమాలతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. నేటికీ థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో కొత్త సినిమాలకు టఫ్ ఫైట్ ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X