మీనాక్షితో అలా.. నాతో మాత్రం మరోలా.. అనిల్ రావిపూడిపై ఐశ్వర్య ఫిర్యాదు
ఎపుడు నుంచో తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి కంప్లైట్స్ లో మన తెలుగు హీరోయిన్స్ కే సరైన అవకాశాలు లేవు అనే మాట కూడా ఒకటి. పేరుకే తెలుగు సినిమా కానీ మన దగ్గర కూడా మంచి విలన్స్, హీరోయిన్స్ ఉన్నప్పటికీ నార్త్ సైడ్ ఇంకా తమిళ్, మలయాళ ముద్దుగుమ్మలు అంటేనే ఎక్కువ మక్కువ చూపిస్తూ వస్తున్నారు. దీనితో తెలుగు హీరోయిన్స్ కి అసలు అవకాశాలు ఉండడం లేదు.
కానీ ఇప్పుడిపుడే కొంచెం తెలుగు హీరోయిన్స్ కూడా ఒకో సినిమా చేస్తుండగా కొంచెం పర్వాలేదనిపిస్తుంది. కానీ లేటెస్ట్ గా ఓ తెలుగు హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా ఇటీవల తెలుగు సినిమా దగ్గర వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ సినిమానే "సంక్రాంతికి వస్తున్నాం". కాగా ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ ఐశ్వర్య రాజేష్ అలాగే నార్త్ నుంచి మీనాక్షి చౌదరిలు నటించారు.

కాగా లేటెస్ట్ గా ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ఇపుడు ఆసక్తిగా మారాయి. ఈ సినిమా చేసి హిట్ కొట్టినప్పటికీ ఈ చిత్రం ర్శకుడు అనీల్ రావిపూడి విషయంలో మాత్రం ఆమె చాలా డిజప్పాయింట్ గా ఉందని మాత్రం ఆమె మాటలతో అర్ధం అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ అంతా కలిసి వెంకీ మామ ఇంట హీరో రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఓ ఓటిటి షోకి హాజరు అయ్యారు.
కాగా ఇందులో సంక్రాంతికి వస్తున్నాం సెట్స్ లో అనీల్ రావిపూడితో అనుభవం నవ్వుతూనే ఐశ్వర్య రాజేష్ షేర్ చేసుకుంది. సినిమా షూటింగ్ సమయంలో తాను టేక్ లు తీసుకునే సమయంలో అనీల్ రావిపూడి తనకైతే ఒకలా మీనాక్షికి ఒక రకంగా చెప్పేవాడని కామెంట్స్ చేసింది. మీనాక్షి విషయంలో ఎంతో నైస్ గా చెప్తే తనకి మాత్రం మరో రకంగా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అన్నట్టుగా చెప్పేవాడని ఈ విషయంలో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ సమయంలో ఇబ్బంది పడింది అన్నట్టుగా నవ్వుతూనే తాను హర్ట్ అయ్యానని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.
దీనితో సోషల్ మీడియాలో అనీల్ రావిపూడి తన హీరోయిన్స్ విషయంలో చూపించిన ఈ వివక్షపై పలు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోయిన్స్ మన దగ్గర తక్కువ కనిపిస్తున్నారు. సరే పోనీ వచ్చిన అవకాశాల్లో అయినా ఇలా అవమానకరంగా ట్రీట్ చేస్తే అది ఖచ్చితంగా వారిని మరింత బాధించి తీరుతుంది.
అలాగే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయే అయినప్పటికీ టాలీవుడ్ లో తనకి సరైన అవకాశాలు ఉండట్లేదు అని ఎప్పుడో రిపబ్లిక్ సినిమా సమయంలోనే చెప్పుకొచ్చింది. ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక మంచి ఎంటర్టైనర్ చేసినప్పటికీ ఆ సినిమాలో జరిగిన చేదు అనుభవం మాత్రం అలా ఉంటూనే ఉంటుంది. మరి అనీల్ రావిపూడి కూడా ఇలా ట్రీట్ చేయడం అనేది మాత్రం ఒకింత ఆశ్చర్యంగా మారింది. ఇక వీరి సినిమా ఆల్రెడీ రికార్డు వసూళ్లు అందుకుంటూ మన సీనియర్ లో ఆల్ టైం టాప్ 2 రికార్డు గ్రాసర్ గా కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications











