వారం రోజులు నరకంలో మీనాక్షి చౌదరీ.. స్టార్ హీరో సినిమా ఎఫెక్ట్‌తో!
మీనాక్షి చౌదరి.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తంలో మారుమ్రోగిపోతోన్న పేరు ఇది. ఆ రేంజ్‌లో ఈ చిన్నది ఏకధాటిగా సినిమాలు చేస్తూ తనదైన మార్కును చూపిస్తోంది. దీంతో ఎక్కడ చూసినా, విన్న ఆమె గురించే వార్తలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మీనాక్షి చౌదరి ఓ స్టార్ హీరో సినిమా వల్ల వారం రోజుల పాటు నరకం చూశానని సంచలన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
టాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత హిట్: ది సెకెండ్ కేస్‌తో భారీ విజయాన్ని దక్కించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఆఫర్లను కూడా స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే మహేశ్ బాబుతో గుంటూరు కారం, తమిళంలో కోలై, సింగపూర్ సెలూన్, ది గోట్, మెకానిక్ రాఖీ, మట్కా మూవీలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో లక్కీ భాస్కర్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టింది.

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తనదైన ప్రభావాన్ని చూపించిన మీనాక్షి చౌదరి.. సంక్రాంతికి విడుదల కాబోతున్న వెంకటేష్ - అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీలోనూ నటించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి చౌదరి తన లైఫ్‌లో జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
మీనాక్షి చౌదరి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో వచ్చిన ది గోట్ సినిమాలో నా పాత్ర చాలా తక్కువగా ప్రాధాన్యం లేకుండా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత నాపై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఇలా వారం రోజుల పాటు బాధను అనుభవించాను అని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ మీనాక్షి చౌదరి కంటిన్యూ చేస్తూ.. ది గోట్ మూవీ రోల్‌పై వచ్చిన ట్రోల్స్ వల్ల నా సినిమాల విషయంలో మరింతగా ఫోకస్ చేయాలని భావించాను. అందుకే నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నేను చేస్తున్న మూవీలు అలానే ఉండబోతున్నాయి అని వివరించింది. మొత్తానికి మీనాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారాయి.
ఇదిలా ఉండగా.. మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది. దీనితోపాటు ఆమె అనగనగా ఒక రాజు అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











