మా 'ఆ పెళ్లి' అయితే అయిపొయింది.. కానీ అదే బాకీ.. అసలు గుట్టు విప్పిన శృతి హాసన్ ప్రియుడు!
శాంతను హజారికా నటి శ్రుతి హాసన్‌తో ఉన్న రిలేషన్ కారణంగా ముందు నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ విషయం మీద శాంతను నోరు విప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే

డూడుల్స్ సోలో ఎగ్జిబిషన్
శాంతను హజారికా శృతి కారణంగా ఎక్కువగా వార్తల్లో ఉన్నప్పటికీ , ఆయన ఒక ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్. ప్రస్తుతం దక్షిణ ముంబైలో కొనసాగుతున్న తన మొట్టమొదటి ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన్న ప్రమోట్ చేస్తున్నాడు. శాంతను ఇంతకుముందు భారతదేశంలో మరియు విదేశాల్లో కొన్ని ప్రదర్శనలు చేసినప్పటికీ, ఫైన్ ఆర్ట్ గ్యాలరీలో తన డూడుల్స్ సోలో ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.

సమయం దొరికింది
ఇక ఈ విషయంలో ఆయన ఇన్స్ పిరేషన్ గురించి మాట్లాడుతూ, కరోనా ప్రారంభమైనప్పుడు అన్నీ లాక్ చేయ బడి, అందరూ లోపల ఉన్నారు. ఆ పరిస్థితి కారణంగా నా ప్రాజెక్ట్‌లన్నీ రద్దు చేయబడ్డాయి. నేను ఎప్పుడూ నా స్వంత వ్యక్తిగత ప్రదర్శన, సోలో షో చేయాలనుకుంటున్నాను, ఇంతకు ముందు నేను అమ్మో సార్లు సంగీతకారులు మరియు బ్రాండ్‌లతో కలిసి పనిచేశాను, కానీ ఇది చాలా వ్యక్తిగతమైనది. కాబట్టి లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు నా కళారూపం, నా ప్రేరణ మరియు నా అభ్యాసంతో నేను ఎంత దూరం వచ్చాను అనే విషయాలను ప్రతిబింబించడానికి నాకు ఎక్కువ సమయం దొరికిందని అన్నారు.

ప్రేమించుకుంటున్నాం
శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా తన తాజా ఇంటర్వ్యూలో, శాంతను స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. "ప్రస్తుతం మేము డేటింగ్ ప్రారంభించాము, మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అని వెల్లడించారు.

స్పూర్తినిస్తూ ముందుకు
ఆర్ట్, సంగీతం, విభిన్న మార్గాల్లో ఒకరినొకరు ప్రభావితం చేయడమే కాదు దుస్తులను డిజైన్ వంటి అనేక సృజనాత్మక ప్రక్రియలలో పాల్గొంటున్నామని అన్నారు. ఇది మా ఇద్దరికీ ఒక క్రియేటివ్ జర్నీ, మేము ఇద్దరం ఒకరి క్రియేటివ్ పవర్ ను మరొకరం ఫీడ్ చేసుకుంటామని చెప్పుకొచ్చారు. . అది నిజంగా మనల్ని స్పూర్తినిస్తూ ముందుకు నడిపించే అంశమని అన్నారు.

ఆ పెళ్లి అయిపొయింది
నేను ఎల్లప్పుడూ ఆమె నుండి ప్రేరణ పొందుతాను, ఆమె కూడా నా నుండి ప్రేరణ పొందిందని ఆమె నాకు చెబుతుంది అది మా మధ్య ఉన్న సంబంధం, "అని ఆయన చెప్పుకొచ్చారు. ఆమెతో క్షణం కూడా విసుగు అనిపించదు, సంప్రదాయబద్ధమైన పెళ్లి ఎప్పుడొస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి క్రియేటివ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక శృతి కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన ఒక సినిమాలో, ప్రభాస్ సరసన మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ కరణంగా శృతి వరుస షూటింగులు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో సమయం గడిపేందుకు ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











