Nithya Menen వెంటపడిన కుర్రాడు ఇతనే.. అలా అయితే అసలు ప్రేమించే వాడిని కాదని సమాధానం..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపును అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్లలో నిత్యమీనన్ ఒకరు కమర్షియల్. విభిన్నమైన పాత్రల్లో ఎక్కువగా కనిపించే నిత్యామీనన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల ఆమె పెళ్లి పై అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్ లో కూడా నిత్యా మీనన్ ఒక వ్యక్తి తనను గత ఆరేళ్లుగా వేధిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఆమె చెప్పిన సదరు వ్యక్తి కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందులో నిజం లేదని..

అందులో నిజం లేదని..

మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిత్యామీనన్ పెళ్లి జరగబోతున్నట్లు గత కొన్ని వారాల క్రితం కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లుగా కూడా చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే అదే విషయంపై నిత్యామీనన్ వెంటనే క్లారిటీ ఇచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదు అని ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నాను అని తెలియజేసింది.

ఆరేళ్ళు గా వెంట పడుతున్నాడు

ఆరేళ్ళు గా వెంట పడుతున్నాడు

అయితే ఇటీవల ఇంటర్వ్యూలో నిత్యమీనన్ తనపై వేధింపులు పాల్పడిన ఒక వ్యక్తి గురించి కూడా ఊహించని వివరణ ఇచ్చింది. సంతోష్ వర్కీ అనే ఒక యూట్యూబర్ గత ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడు అని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నాడు అంటూ నిత్యమీనన్ డైరెక్ట్ గా తెలియజేసింది. అయితే అప్పటినుంచి సోషల్ మీడియాలో తన పెళ్లి పై అనేక రకాల వార్తలు వచ్చాయని కూడా ఆమె తెలిపింది.

30 నెంబర్లు బ్లాక్ చేశాను

30 నెంబర్లు బ్లాక్ చేశాను

అతను దాదాపు 30 నెంబర్లతో నన్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. నేను ఆ వేదింపులు తట్టుకోలేక అన్ని రకాల నెంబర్లను కూడా బ్లాక్ చేశాను. నా తల్లిదండ్రులను కూడా ఫోన్ చేసి విసిగించేవాడు. అయినప్పటికీ కూడా నేను అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మా తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా క్షమించి వదిలేసాను. అతని మానసిక పరిస్థితి బాగో లేకపోయి ఉండవచ్చు అని కూడా వారికి నచ్చ చెప్పాను.. అని నిత్యమీనన్ తెలిపింది.

అయినా మారలేదు

అయినా మారలేదు

అయితే తాను జాలిపడి వదిలేసినప్పటికీ కూడా అతను ఇంకా ఏమి మారలేదు. అదే తరహాలో నా పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నాడు అని అర్థమయింది అని నిత్యమీనన్ అలా ఇంటర్వ్యూలో చెప్పడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.

సంతోష్ వర్గీ రియాక్షన్

సంతోష్ వర్గీ రియాక్షన్

అయితే నిత్యమీనన్ స్పందించిన తర్వాత సంతోష్ వర్కీ తన సైడ్ నుంచి మరొక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 30 నంబర్ల నుంచి కాల్ చేసి వేధించినట్లు నిత్యమీనన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. అసలు ఒక్క వ్యక్తి మీద అన్ని సిమ్ కార్డులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవాలి. అసలు నిత్యా మీనన్ తో మరో వ్యక్తికి ఎంగేజ్మెంట్ అయ్యింది అని ఆమె తల్లి చెప్పినట్లు సంతోష్ వివరణ ఇచ్చారు.

Recommended Video

Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
ఆ విషయం తెలిసి ఉంటే..

ఆ విషయం తెలిసి ఉంటే..

మరోవైపు నిత్యా తండ్రి అలాంటిదేమి లేదని అన్నారు. అందువల్లే నేను కొంత కన్ఫ్యూజన్ తో కంగారు పడ్డాను. వాళ్లు తనపై లైగిక వేధింపుల కేసు పుట్టబోతున్నారని తెలిసింది అని సంతోష్ వర్గీ తెలియజేశాడు. ఇక అలాంటి విషయాలు తెలిసి ఉంటే అసలు నేను ఆమెతో ప్రేమలో పడి తన చుట్టూ తిరిగేవాడిని కాదని అంటూ మా తండ్రి మరణం తరువాత తాను ఎలాంటి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.. అని సంతోష్ వర్కీ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X