టాలీవుడ్ హీరోయిన్ బాడీ గురించి నెటిజన్ల కామెంట్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేసింది.. ఆ వేళ్ళు మీవైపే అంటూ!
బాల నటిగా కెరీర్ ప్రారంభించిన సానుష సంతోష్ అంటే దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. బంగారం సినిమాలో మీరాచోప్రా చెల్లెలుగా నటించిన ఈ భామ ఆ తర్వాత ఇటీవలి కాలంలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో కూడా ఒక జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. తన శరీరం గురించి నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ విషయంలో ఈ భామ తాజాగా ఒక అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.
Recommended Video

మల్లూ బ్యూటీ
కేరళలోని కన్నూర్ జిల్లాలో జన్మించిన సానుష చిన్న వయసులోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. పుట్టిన వెంటనే కొద్దిరోజులకే ఆమె ఒక మలయాళం సినిమాలో బాలనటిగా నటించింది. ఇక అలా తన కెరీర్ మొదలు పెట్టిన ఆమె దాదాపు 20కిపైగా మలయాళ సినిమాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత ఒక తమిళ సినిమాలో కూడా ఆమె నటించింది.

బంగారం సినిమాతో
బంగారం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మీరాచోప్రా చెల్లెలి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే స్వతహాగా మలయాళ అయిన ఈ భామ ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాలు చేసింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన జీనియస్ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ భామకు ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు.

నాని సినిమాలోకీలక పాత్ర
ఇక రెండేళ్ల క్రితం నాని హీరోగా క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చిన జెర్సీ సినిమాలో నాని జీవితచరిత్రను రాసి జర్నలిస్ట్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ మధ్య కాస్త బొద్దుగా తయారవడంతో ఆమె ఫాలోవర్స్ అంతా బరువు గురించి అనేక రకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

భరించి భరించి
కొన్నాళ్లపాటు బాగానే భరిస్తూ వచ్చిన ఈ మల్లూ బ్యూటీ ఇక భరించాల్సి అవసరం లేదని చెబుతూ ఫ్రీక్ ఔట్ అయింది. తన బరువు గురించి కామెంట్ చేస్తున్న అందరికీ తన సోషల్ మీడియా వేదికగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా వేసింది. "ఓహ్ అవును !! బహుశా నాకన్నా ఎక్కువగా నా బరువు గురించి ప్రస్తావిస్తూ, దాని గురించి చింతిస్తూ & దాని గురించి ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ, స్వీట్‌హార్ట్, మనం బతికేది ఈ బరువు తగ్గడానికి అలాగే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు అని పేర్కొంది.

ఆ వేళ్ళు మీ వైపే ఉంటాయి చూసుకోండి
అంతే కాక మీకు వేరొకరి శరీరం గురించి కామెంట్ చేయడానికి అంత సరదాగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఒకరి ఒక వేలు చూపిస్తూ ఉంటే మిగతా వేళ్ళు మీ వైపు చూపిస్తూ ఉంటాయనే విషయం గుర్తుంచుకోండి. మీరు కూడా అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు కదా. మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











