మంటల్లో యాక్షన్, ఫైట్ సీన్లు.. దేవుడి దయ వల్ల అలా.. తమ్ముడులో సప్తమీ గౌడ ఎక్స్‌పీరియెన్స్

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో హీరోయిన్ సప్తమీ గౌడ మాట్లాడుతూ..

కాంతార సినిమా తర్వాత నాకు డైరెక్టర్ వేణు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పాడు. టైటిల్, ఇంకా అనుకొని సమయంలో నేను హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు లుక్ టెస్ట్ చేసి కన్ఫార్మ్ చేసుకొన్న తర్వాత రత్న క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం రాసుకొన్న డైలాగ్స్ నాతో చెప్పించారు. నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన తర్వాత గుర్రపు స్వారీ నేర్చుకోవాలని చెప్పారు. ఈ సినిమాకు ఎంపిక చేసిన తొలి యాక్టర్‌ను నేనే. ఆ తర్వాత ఈ సినిమా బిగ్గర్ స్కేల్‌కు మారింది అని సప్తమీ గౌడ చెప్పారు.

Saptami Gowda Interview

ఈ సినిమా షూటింగ్ అరకు ప్రాంతంలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో నితిన్ భుజానికి గాయం కావడంతో కొన్ని రోజులు సినిమా షూట్ వాయిదా పడింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు రత్న. అంబర్ గొడుగు అనే ప్రాంతంలో సాధారణ జీవితాన్ని గడిపే యువతి. నా పాత్రకు బ్యాక్ స్టోరి ఉంటుంది. లయ గారు.. నితిన్ గారితో నా పాత్ర ట్రావెల్ అవుతుంది. ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్‌లో నటించాను అని సప్తమీ గౌడ తెలిపారు.

మూవీ కథ గురించి చెప్పిన తర్వాత దిల్ రాజు గురించి వేణు శ్రీరాం చెప్పారు. ఆయన నిర్మాత కావడం ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒక కారణం. నితిన్ హీరో కావడం రెండో కారణం. ఏ సినిమాకైనా నిర్మాత బాగా అవసరం. ప్రేక్షకుడిని మెప్పించడానికి మంచి బడ్జెట్ అవసరం. సినిమాను రూపొందించడానికి నిర్మాత క్రూషియల్. ఈ సినిమా కోసం చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. దాని కోసం బాగా ఖర్చు పెట్టారు.

దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమా కోసం ఎవరూ కష్టపడని విధంగా పనిచేశారు. ఆయనకు ప్రతీ విషయంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. నేను ఎలా తెరపైన కనిపించాలి. నా హెయిర్ స్టయిల్ ఎలా ఉండాలి. నేను కూర్చొనే చైర్ ఎలా ఉండాలి. నేను వేసుకొనే బట్టలు ఎలా ఉండాలనే విషయాలపైనే కాకుండా సినిమాలోని ప్రతీ విషయంపై పూర్తి పట్టు ఉంది. ఆయన టాస్క్ మాస్టర్ అని చెప్పాలి. తనకు నచ్చేంత వరకు సీన్ చేస్తూనే ఉంటారు. ఈ విషయంలోను రాజీ పడరు అని సప్తమీ గౌడ చెప్పారు.

యాక్షన్ సీక్వెన్స్ చాలెంజింగ్ అనిపించాయి. సింగిల్ షాట్‌లో షూట్ చేశారు. రెండు కెమెరాలతో షూట్ చేశారు. నిజంగా ఫైర్ ఉపయోగించారు. మంటల మధ్య ఫైట్స్ చేశాం. ఆ సమయంలో సింథటిక్ చున్నీ వేసుకొన్నాను. ఆ సమయంలో నిప్పు అంటుకొంటే ప్రమాదం జరిగి ఉండేది. కానీ దేవుడి దయవల్ల ఏం కాలేదు. చాలా సేఫ్‌గా షూటింగ్ కంప్లీట్ అయింది. యాక్షన్ సీన్ల కోసం నేను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. నేను కాలేజీ సమయంలో అథ్లెట్. నేను నేషనల్ లెవెల్ స్విమ్మర్‌ను. అందువల్ల నాకు జంపింగ్ చేయడం, ఫైట్స్ చేయడం కష్టం కాలేదు. హార్స్ రైడింగ్ నేర్చుకొన్నాను అని సప్తమీ గౌడ తెలిపారు

More from Filmibeat

Read more about: Saptami Gowda nithiin thammudu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X