మా శరీరాలపై అలా ఫోకస్.. అసభ్యకరంగా ఫోటోలు తీసి.. కన్నడ భామల ఆగ్రహం
సినీ ఇండస్ట్రీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో మహిళల గౌరవం, మీడియా ప్రవర్తన, ప్రొఫెషనల్ హద్దులపై మరోసారి పెద్ద చర్చ లేవనెత్తారు. తాజాగా కన్నడ హీరోయిన్స్ సప్తమి గౌడ (Sapthami Gowda), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath), రుక్మిణి వసంత్‌లు (Rukmini Vasanth) లు చేసిన పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సినిమా, పబ్లిక్ ఈవెంట్స్‌కు హాజరయ్యే హీరోయిన్స్, నటీమణులను అభ్యంతరకరంగా ఫోటోలు తీయడం, అలాగే, శరీర భాగాలపై ఉద్దేశపూర్వకంగా జూమ్ చేయడం చూపించడం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమైందంటే?
కొన్నేళ్ల క్రితం వరకు పాపారాజీ కల్చర్ బాలీవుడ్‌కే పరిమితమై ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ ఈ ధోరణి పెరుగుతోంది. సినిమా ఆడియో లాంచ్‌లు, ట్రైలర్ రిలీజ్‌లు, అవార్డ్ వేడుకలు, ప్రెస్ మీట్లు వంటి కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు గుంపులుగా చేరి సెలబ్రిటీల ఫోటోలు తీస్తున్నారు. అయితే ఇక్కడే సమస్య మొదలవుతోంది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మహిళా నటీమణుల శరీర భాగాలపై అనవసరంగా జూమ్ చేయడం, అసభ్యకర యాంగిల్స్‌లో వీడియోలు తీయడం, ఆ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఈ విషయంపై కన్నడ హీరోయిన్స్ మండిపడుతున్నారు. మా కళను ప్రజలకు పరిచయం చేయడానికి. కానీ శరీరాన్ని హైలైట్ చేసే విధంగా చిత్రీకరించడం పూర్తిగా అవమానకరమని ఆమె పేర్కొన్నారు.

మా గౌరవం దెబ్బతీయొద్దు- సప్తమి గౌడ
ఈ అంశంపై కాంతార' (Kantara)ఫేమ్ సప్తమి గౌడ స్పందించారు. కొన్ని ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన ఆమెకు అసహనాన్ని కలిగించిందని సమాచారం. దీనిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించి తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు.పబ్లిక్ ఈవెంట్స్‌లో తీసే అనుచిత వీడియోలు, అసభ్యకర యాంగిల్స్ మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె అన్నారు. ఇలాంటి చర్యలు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని, అవి పూర్తిగా అంగీకరించలేనివని స్పష్టం చేశారు.
'మేము ఇక్కడ మా పనికోసం ఉన్నాము. మా శరీరాలను హైలైట్ చేయడం కోసం కాదు'అని ఆమె పేర్కొన్నారు. సప్తమి గౌడ కూడా మా శరీర భాగాలపై ఉద్దేశపూర్వకంగా జూమ్ చేయడం చూపించడం సరికాదని తీవ్రంగా ఖండించారు. ఇవి మహిళల గౌరవానికి స్పష్టమైన ఉల్లంఘనలని పేర్కొన్నారు.ఈవెంట్లను కవర్ చేసే వారు ప్రొఫెషనల్‌గా, మర్యాదగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలను సహించబోమని, ప్రతి మహిళకు మద్దతుగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఇది గౌరవానికి భంగం- రుక్మిణి వసంత్
నటి రుక్మిణి వసంత్ తన సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యను మొదట ప్రస్తావించారు. ఆమె తన పోస్టులో, సినీ పరిశ్రమలో మహిళలుగా మేమంతా కలిసి ఒక సమస్యను ప్రస్తావిస్తున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ ఈవెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఆడియో లాంచ్‌లు వంటి కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా నటీమణుల వీడియోలు, ఫోటోలు కొన్ని అసభ్యకర కోణాల్లో చిత్రీకరించబడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా, కొన్ని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మహిళా నటీమణుల శరీర భాగాలపై జూమ్ చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా గౌరవానికి విరుద్ధమని, అసహ్యకరమైన చర్య అని స్పష్టం చేశారు. అభ్యంతరకరంగా ఫోటోలు తీయడం మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలని, ఇవి ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆమె తేల్చి చెప్పారు.
మా బాడీని కాదు పనిని చూడండి- ఆశిక రంగనాథ్
నటి ఆశిక రంగనాథ్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ రుక్మిణి వసంత్ అభిప్రాయాలకు మద్దతు తెలిపారు. ఆమె తన పోస్టులో ఈ సమస్య ఒకసారి కాదు, పదేపదే జరుగుతోందని పేర్కొన్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో మహిళా నటీమణుల ఫోటోలను అసభ్యతరంగా తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేయడం పూర్తిగా అవమానకరమని ఆమె అభిప్రాయపడ్డారు. 'మమల్నీ గౌరవించండి, కానీ కించపరచకండి'అని పేర్కొనడం గమనార్హం.
'మా కళను గౌరవించండి. మా శరీరాలను కాదు'అనే సందేశాన్ని ఆమె పరోక్షంగా ఇచ్చారు. ఈవెంట్లను కవర్ చేసే మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాలని, మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఇది కేవలం ఒకరి సమస్య కాదని, పరిశ్రమలో ఉన్న ప్రతి మహిళ ఎదుర్కొంటున్న అంశమని ఆమె పేర్కొన్నారు. అందుకే ఈ విషయంలో మేమంతా ఒకటిగా నిలుస్తున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications











