twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఆ ఛాన్సే లేదు.. నా చేతిలో ఏమీలేదు..సారా ఆలీ ఖాన్ బోల్డ్ కామెంట్స్

    |

    నవాబ్ ఖాన్‌దాన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సైఫ్ ఆలీ ఖాన్ కూతురుగా సారా ఆలీ ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2018లో అభిషేక్ కపూర్ రూపొందించిన కేదార్‌నాథ్ చిత్రంతో హిందీ చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 2020లో వచ్చిన రోహిత్ శెట్టి సింబాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారు. అలాగే ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్ కల్ చిత్రంతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు.

    తాజాగా ఆమె నటించిన కూలీ నంబర్ 1 చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకొంటున్నది. ఈ క్రమంలో సారా ఆలీ ఖాన్ మాట్లాడుతూ.. నేను సినిమాలను ఎప్పుడు నా ఛాయిస్ ప్రకారం ఎంపిక చేసుకొను. సినిమాలే నన్ను ఎంపిక చేసుకొంటాయి అని అన్నారు.

    Sara Ali Khan about Coolie No 1 and her career in bollywood

    నా కెరీర్ ఆరంభంలో నేను ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. దాంతో సినిమాలే నన్ను ఎంపిక చేసుకొన్నాయి. నేను ఎంపిక చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో నటిగా రాణించాలంటే కొన్నిసార్లు ఛాలెంజింగ్‌గా అనిపిస్తాయి. ప్రతీ రంగంలో కూడా సానుకూలత, ప్రతికూలత ఉంటాయి. ప్రేక్షకులను, అభిమానులను మెప్పించాలంటే చాలా కష్టడాల్సి వస్తుందని అన్నారు. సారా ఆలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1 చిత్రం డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్నది.

    English summary
    Sara Ali Khan open up about Coolie No 1 and her career in bollywood. She said, I don’t choose my films, my films choose me. I have been very lucky that early in my career, I have got to work with directors that I am not in a position to choose.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X