For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తన తండ్రి పేరును నిలబెట్టేందుకు ఎంతగానో శ్రమించడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా అందంతో పాటు అభినయంలో రాణిస్తూ సారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో లవ్ ట్రాకులతో తరచూ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సారా అలీ ఖాన్ టీమిండియా స్టార్ క్రికెటర్‌తో కలిసి కనిపించింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అలా పరిచయం.. సక్సెస్‌ఫుల్‌గా

  అలా పరిచయం.. సక్సెస్‌ఫుల్‌గా

  స్టార్ డాటర్‌గా ప్రపంచానికి పరిచయమైన సారా అలీ ఖాన్.. ‘కేదార్‌నాథ్' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. దీని తర్వాత ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె కెరీర్ దూసుకెళ్తోంది.

  హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

  వరుస సినిమాలతో సారా హవా

  వరుస సినిమాలతో సారా హవా

  బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోవడంతో సారా అలీ ఖాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ‘లవ్ ఆజ్ కల్', ‘కూలీ నెంబర్ 1', ‘అత్రంగీ రే' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంతో పాటు ‘గ్యాస్ లైటర్' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్‌లు కూడా చేయబోతుంది.

  ఆ స్టార్ హీరోతో సారా లవ్ ట్రాక్

  ఆ స్టార్ హీరోతో సారా లవ్ ట్రాక్

  బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలోనే తెగ హైలైట్ అయింది. దీనికి కారణం ఆమె స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడపడమే. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక సందర్భంలో విడిపోయినా.. మళ్లీ జంటగా కనిపించారు. దీంతో సారా - కార్తీక వివాహం కూడా చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

  Cobra Twitter Review: కోబ్రాకు అలాంటి టాక్.. ఆ ట్విస్ట్ హైలైట్.. అది మాత్రం బిగ్ మైనస్!

  లవ్ ట్రాకులతోనే ఫుల్ ఫేమస్

  లవ్ ట్రాకులతోనే ఫుల్ ఫేమస్

  సినిమాల పరంగా సారా అలీ ఖాన్‌కు ఎంత పేరు వచ్చిందో.. లవ్ ట్రాకుల విషయంలోనూ అదే రీతిలో పాపులర్ అయింది. అప్పట్లో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. ‘కేదార్‌నాథ్' మూవీ అసిస్టెంట్ డైరెక్టర్‌తోనూ డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అలాగే, మరో వ్యక్తితోనూ ఈ బ్యూటీ చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసేసింది.

  స్టార్ క్రికెటర్‌ను కలిసిన సారా

  స్టార్ క్రికెటర్‌ను కలిసిన సారా

  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న సారా అలీ ఖాన్.. ఖాళీ సమయాల్లో పర్సనల్ లైఫ్‌ను సైతం తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ రెస్టారెంట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కలిసింది. ఆ యంగ్ సెన్సేషన్‌ను సారా అలీ ఖాన్ కలవడం ఇప్పుడు దేవ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

  పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

  నైట్ టైం ఇద్దరూ అలా బుక్

  నైట్ టైం ఇద్దరూ అలా బుక్

  ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బింబాబ్వే పర్యటనను ముగించుకుని వచ్చాడు. అలాగే, సారా అలీ ఖాన్ కూడా షూట్‌లు కంప్లీట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఫలితంగా వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  వాళ్లిద్దరూ.. వాళ్లకు పార్ట్‌నర్స్

  వాళ్లిద్దరూ.. వాళ్లకు పార్ట్‌నర్స్

  సారా అలీ ఖాన్ - శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతోన్నాయి. ఇప్పటికే సారా.. కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఓ షోలో ఒప్పుకుంది. అయితే, గిల్ మాత్రం సచిన్ టెండూల్కర్ కూతురు సారాను ప్రేమించాడని వార్తలు వచ్చాయి. కానీ, ఈ మధ్య వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయిపోయారు.

  English summary
  Bollywood Actress Sara Ali Khan Recently Met with Cricketer Shubman Gill. This Meeting Pic Gone Be Hot Topic in Bollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X