For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీతో వెర్రెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు.. హాట్ సమ్మర్లో మరింత హీట్ పెంచేస్తోందే!

  |

  ప్రతి రంగంలోనూ వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే అయినా సినీరంగంలో వారసులు ఎంట్రీ ఇచ్చిప్పుడు వారి మీద అందరి దృష్టి కచ్చితంగా ఉంటుంది. తమ తల్లిదండ్రుల క్రేజ్ వాడుకుని వారు ఎంత వరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు అనే విషయం మీద అందరూ ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే తన తండ్రి నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక పక్క సినిమాల్లో అందాలు ఆరబోస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎక్కడా తగ్గకుండా అందాల ఆరబోతలో రెచ్చి పోతున్నది. ఆ వివరాల్లోకి వెళితే

  కేదార్నాథ్ తో ఎంట్రీ

  కేదార్నాథ్ తో ఎంట్రీ

  సారా అలీ ఖాన్ 2018వ సంవత్సరంలో కేదార్నాథ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి సినిమాతోనే ఆమె ఫిమేల్ బెస్ట్ డెబ్యూట్ అనే అవార్డుని ఫిలింఫేర్ నుంచి అందుకుంది. ఆ తర్వాత ఆమె సింబా అనే సినిమాలో, లవ్ ఆజ్ కల్, కూలి నెంబర్ వన్ లాంటి సినిమాలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే 2021లో ఆమె నటించిన ఆత్రంగి రే సినిమా ఆమె నటనకు మంచి మార్కులు పడేలా చేసింది.

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్


  ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒక సినిమా షూటింగ్ పూర్తి కాగా మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఈ భామ తన అందంతో చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆమెకు ప్రస్తుతానికి పెద్దగా చేతిలో సినిమాలు లేవు కానీ ఫ్యూచర్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ ఆమె గురించి ప్రశంసలు గుప్పిస్తున్నారు.

  34 మిలియన్ల ఫాలోవర్లు

  34 మిలియన్ల ఫాలోవర్లు


  చేతిలో పెద్ద సినిమా ఒక్కటి కూడా లేకపోయినా ఆమెకు ఏకంగా 34 మిలియన్ల ఫాలోవర్లు ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె అభినయానికి తగ్గట్టు అందం కూడా ఉండడంతో కుర్రాళ్ళు ఆమెను చూస్తే వేర్రేక్కిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తనదైన అద్భుతమైన అందాలను ప్రదర్శించడానికి ఆమె సందర్భాలు వెతుక్కుంటూ ఉంటుంది.

  బికినీలో వెర్రేక్కిస్తూ

  బికినీలో వెర్రేక్కిస్తూ


  ఒకసారి చీరలో కనిపించే ఆమె మరోసారి బికినీలో కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే వేసవి వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న జనాన్ని ఆమె తాజాగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది అదేమిటంటే బీచ్ ఒడ్డున మల్టీకలర్ బికినీ వేసుకుని సారా అలీ ఖాన్ ఆ బికినీతో అందాల విందు ఇచ్చింది. ఇంకేముంది కుర్రకారు ఆ ఫొటో చూసి సూపర్ అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  Recommended Video

  John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu
  ప్రేమలో సారా అలీ ఖాన్

  ప్రేమలో సారా అలీ ఖాన్


  అన్నట్లు సారా అలీ ఖాన్ ప్రేమలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కేదార్నాథ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన జహాన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉందని వారు సహజీవనం చేస్తున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయం మీద మాత్రం సరైన క్లారిటీ లేదు. మరి ఈ ప్రేమ వ్యవహారం ఎప్పటికి బయటకు వస్తుందో ఏమో చూడాల్సి ఉంది మరి.

  English summary
  Sara Ali Khan Multicolored Bikini Photos gone viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X