శ్రీలీలాకు పోటీగా రూప.. ‘సారంగపాణి జాతకం’ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ లోకి యంగ్ హీరోయిన్ల సందడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి యేటా కొత్త టాలెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో రష్మిక, శ్రీలీలా, భాగ్యశ్రీ బోర్స్లే, ఆషికా రంగనాథ్ వంటి హీరోయిన్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యంగ్ అండ్ టాలెంట్ హీరోయిన్ రూపా కడువయూర్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ అచ్చమైన తెలుగు హీరోయిన్. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ 'సారంగపాణి జాతకం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్లేశం, బలగం, కోర్టు అనే చిత్రాలతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఇది. ప్రియదర్శి సరసన రూపా కడువయూర్ నటించింది. ఏప్రిల్ 25న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. రివ్యూల ద్వారా సినిమాకు పాజిటివ్ టాక్ ఏర్పడింది. ఇక ఆడియెన్స్ నుంచి కూడా కాస్తా మంచి అభిప్రాయాలను అందుకుంటూ ఉంది. ఈ సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఈ క్రమంలోనే సారంగపాణి జాతకం హీరోయిన్ రూపా కడువయూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. 2020 నుంచి టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉన్న ఈ తెలుగు బ్యూటీ మంచి చిత్రాల్లోనే అవకాశాలు అందుకుంటోంది. అయితే ఈమె గురించిన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రూపా కడువయూర్ 2000 డిసెంబర్ 27న జన్మించింది. విజయవాడలో పుట్టి పెరిగింది. ఆమె విద్యాభ్యాసం మొత్తం స్థానికంగానే జరిగింది.
గుంటూరులోని కస్తూరి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. పట్టా కూడా అందుకుంది. ఫిజియోథెరపిస్ట్ గా సేవలు అందిస్తోంది. కూచిపూడి, భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఇక డాక్టర్ గా ఓవైపు సేవలందిస్తూనే మరోవైపు నటిగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు రావడంతో సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించింది. వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటోంది.
ఇక హీరోయిన్ శ్రీలీలా లాగానే రూపా కడువయూర్ కూడా 6 ఏళ్ల వయస్సులోనే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. రోజుకు 3 గంటల పాటు సాధన చేసేది. ఇక ఈమె సంగీతకారుడు, నటుడు మంగళంపల్లి బాలకృష్ణ మురళీ నుంచి నృత్య పోటీల్లో అవార్డును కూడా అందుకుంది. అలా చిన్నప్పటి నుంచే కళకు దగ్గరైన ఆమె ఇప్పుడు హీరోయిన్ గా అలరిస్తోంది. తొలుత క్రేజీ హీరో సత్యదేవ్ సరసన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలిచిత్రంతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ ను అందుకుంది. ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్రెంట్, తమిళంలో యమకతంగి చిత్రంలో నటించింది. ప్రస్తుతం సారంగపాణి చిత్రంతో అలరిస్తోంది. ఇక డ్యాన్స్, నటనలో ప్రశంసలు అందుకుంటున్న ఈమె మరో శ్రీలీలా క్రేజ్ దక్కించుకుంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











