Saravanan Arul's The legend హీరోయిన్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా.. నయనతారకు మించి రెమ్యునరేషన్..

ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ పారితోషకాలు కూడా ఊహించిన విధంగా పెరిగిపోతున్నాయి. ఓ వర్గం హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా వారు కూడా 15 కోట్లకు పైగా డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా నాయనతర కంటే ఎక్కువ స్థాయిలో ఒక హీరోయిన్ ఊహించిన విధంగా పారితోషికం అందుకోవడం విశేషం. అది కూడా ఎంతో ట్రోలింగ్ కు గురైన ది లెజెండ్ సినిమా హీరోయిన్ కావడం విశేషం. ఆమెకు నయనతార సమంత కంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారీగా రెమ్యునరేషన్స్

భారీగా రెమ్యునరేషన్స్

ఇటీవల ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదలవుతోంది అంటూ హడావిడి చేసిన ది లెజెండ్ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ కు గురి అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు పనిచేసిన వారికి చాలావరకు ఒక విధంగా లైఫ్ సెటిల్మెంట్ అనే విధంగానే పారితోషికాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త హీరోగా మారి ఈ సినిమాను నిర్మించడం జరిగింది. దీంతో సినిమాలో కనిపించిన ప్రధాన నటీనటులకే ప్రముఖ టెక్నీషియన్స్ కు కూడా కోట్లల్లోనే ఆదాయం అందినట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ వ్యాపారవేత్త

ప్రముఖ వ్యాపారవేత్త

ది లెజెండ్ సినిమాలో నటించిన శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను తమిళ నాడులో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన వ్యాపారవేత్త. శరవణ స్టార్స్ ద్వారా అతి తక్కువ కాలంలోనే వందల కోట్ల ఆదాయాన్ని అందుకున్న అతను ఎప్పటినుంచో సినిమా రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తానికి ఒక భారీ బడ్జెట్ సినిమాతో సినిమా చేయాలని తన కోరికను కూడా తీర్చుకున్నాడు.

మాస్ యాంగిల్ లో..

మాస్ యాంగిల్ లో..

ఎంతో సంపన్నుడు అయినా శరవణన్ తీస్తే పెద్ద సినిమా తీయాలని అనుకుని రెండు మూడేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నాడట. ఇక మొత్తానికి అతనితో సినిమా చేయడానికి ఇద్దరి దర్శకులు సిద్ధం అవ్వడం విశేషం. జెడి - జెర్రీ అనే ఇద్దరు దర్శకులు ది లెజెండ్ సినిమాలో శరవణన్ ను మాస్ హీరోగా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి కమర్షియల్ అంగులతో వచ్చిన ఆ సినిమా కోసం భారీ స్థాయిలోనే ఖర్చుపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది.

నలుగురు హీరోయిన్స్

నలుగురు హీరోయిన్స్

అయితే ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్స్ అయితే కనిపించారు. ముఖ్యంగా ఊర్వశి రౌటేలా సినిమాలో ప్రధాన హీరోయిన్ గా కనిపించగా గీతిక తివారి మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. అలాగే యాశీకా ఆనంద్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించగా రాయ్ లక్ష్మి ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్ లో కనిపించింది. మొత్తంగా వీళ్లకోసమే భారీ స్థాయిలో ఖర్చుపెట్టినట్లు సమాచారం.

నయన్, సామ్ కంటే ఎక్కువగా

నయన్, సామ్ కంటే ఎక్కువగా

అయితే ముఖ్యంగా ఊర్వశి రౌటేలా పారితోషికం అయితే ఊహించని విధంగా ఉన్నట్లుగా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వైరల్ గా మారుతొంది. ఆమె తన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా అత్యధిక భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో నయనతార 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. సమంత కూడా బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత 7 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఊర్వశి రౌటేలా రెమ్యునరేషన్ 20 కోట్లు

ఊర్వశి రౌటేలా రెమ్యునరేషన్ 20 కోట్లు

అయితే ది లెజెండ్ సినిమా కోసం మాత్రం ఊర్వశి, నయనతార, సమంత కంటే ఎక్కువగా ఒకేసారి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు ఆమె తమిళ ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అదే ఆమెకు తమిళంలో మొదటి సినిమా. కానీ అగ్ర హీరోయిన్స్ కంటే ఎక్కువ స్థాయిలో మొదటిసారిగా ఊర్వశి రౌటేలా 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక ఈ సినిమాలో ప్రభు, సుమన్, విజయ్ కుమార్, యోగి బాబు, వివేక్, రోబో శంకర్ ఇలా మరికొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించి మంచి పారితోషికాలను అందుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X