Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు సార్ మీరే నా లక్కీ చార్మ్.. అబ్బబ్బబ్బా.. మెగాసూపర్ ఈవెంట్లో రష్మిక మందన్న చమక్కులు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.
సందడే సందడి
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది.
ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లు
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.
కిక్కిచ్చిన రష్మిక మందన్న
ఈ సందర్బంగా వేదికపై రష్మిక మందన్న మాట్లాడుతూ సూపర్ కిక్కిచ్చింది. వేదికపైకి ఎక్కగానే మెగాసూపర్ అభిమానులకు ముద్దులిచ్చింది. ''అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఆడియన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అంటూ మాజా చేసింది రష్మిక. మీరంతా వచ్చినందుకు థాంక్స్ అని చెప్పింది.
చిరు సార్ మీరే నా లక్కీ చార్మ్
''చెప్పాలంటే చిరు సార్ మీరే నా లక్కీ చార్మ్. మీరు ఛలో సినిమాకు మొదటి సారి వచ్చారు, ఆ తర్వాత రెండోసారి గీతగోవిందం సినిమాకు వచ్చారు.. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అందుకే నేను నా లక్కీ చార్మ్ మీరే అని ఫీల్ అవుతున్నా అని రష్మిక చెప్పింది.
అనిల్ సార్.. విజయశాంతి మేడం ఐ లవ్ యూ
''అనిల్ సార్ కంగ్రాట్స్. మీరు హిస్టరీ క్రియేట్ చేస్తారు. దేవీ శ్రీ మీరు మైండ్ బ్లాక్ చేశారు. విజయశాంతి మేడం ఐ లవ్ యూ.. యూఆర్ మై బిగ్ సిస్టర్. మిమ్మల్ని మొదటిసారి చూసి భయపడ్డాను. కానీ ఆ తర్వాత మీరే నా దైర్యం అయ్యారు. మహేష్ సార్ నమస్తే. హి ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో స్వీట్ అంటే మీరే'' అంటూ అందరిలో జోష్ నింపింది రష్మిక మందన్న