ఇప్పటివరకు నేను చూసిన తెలుగు పర్సన్స్‌లో ఆయనే! దుమ్మురేపిన తమన్నా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది.
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఈ సందర్బంగా వేదికపై డ్యాంగ్ డ్యాంగ్ పాటకు డాన్స్ చేసి దుమ్మురేపిన తమన్నా తన మాటలతో ఆకట్టుకుంది. ''చిరు సార్ నమస్కారం. అనిల్ గారు ఈ రోజు పెద్ద న్యూస్ చెప్పారు. బిగ్ కంగ్రాట్స్. నేను ఇప్పటివరకు చూసిన తెలుగు పర్సన్స్‌లో అనిల్ గారు నైస్ పర్సన్. సరిలేరు నీకెవ్వరు టీం అందరికీ శుభాకాంక్షలు. రష్మిక మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. మీరంతా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఇంత క్రౌడ్ నేనెప్పుడూ చూడలేదు. టీం అందరికీ కంగ్రాట్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్'' అని తెలిపింది తమన్నా.


Click it and Unblock the Notifications











