Just In
- 51 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయంలో తమన్నాకే కలిసొచ్చిన లక్.. రష్మిక మందన్నా ఫ్యాన్స్‌కు మింగుడు పడని వార్త.!
రష్మిక మందన్నా.. నాగశౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కన్నడ నటి. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమె అందం, అభినయానికి మంచి పేరు వచ్చింది. ఈ మూవీ తర్వాత రష్మిక నటించిన 'గీత గోవిందం' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంత ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో కావడంతో అమ్మడు మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా పోస్ట్..? వివరాల్లోకి వెళితే...

అందరి ఛాయిస్ రష్మికనే
ప్రస్తుతం రష్మిక మందన్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రష్మికకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. దీనితో పాటు ఆమె నితిన్ సరసన ‘భీష్మ' అనే మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

ఆ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకుంటోంది
రష్మిక మందన్నా ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు మరికొన్నింటికి సంతకాలు చేసేసింది. అందులో అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమె ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో రష్మిక పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ ఆఫర్‌ను వదులుకుంది
తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మికకు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది. అది కూడా స్టార్ హీరో షాహీద్ కపూర్ పక్కన నటించే అవకాశం. అయితే, దీనిని ఆమె వదులుకున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సూపర్ హిట్ ‘జెర్సీ' రీమేక్‌గా రాబోతుంది.

సరిలేరులో అలాంటి పాత్రే
మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదని, అందుకే ఆమెను టీజర్‌లో చూపించలేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం రష్మిక పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ సినిమా కథను మలుపు తిప్పేది ఆమె పాత్రేనని సమాచారం.

ఆ విషయంలో తమన్నాకే కలిసొచ్చిన లక్
ఈ సినిమా కోసం రష్మిక రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించిన తమన్నా మాత్రం ఊహించని విధంగా రూ. 40 లక్షలు చార్జ్ చేసిందట. అంటే ఐదు నిమిషాల పాటకు తమన్నా ఇంత తీసుకుంటే.. సినిమా మొత్తం ఉన్న రష్మిక మాత్రం తక్కువే అందుకుందన్న టాక్ వినిపిస్తోంది.