సరిలేరు నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: రష్మిక మందన్నా కంటే విజయశాంతికే అడ్వాంటేజ్.!

By Manoj

ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్కని గుర్తింపు తెచ్చుకుంది లేడీ అమితాబ్ విజయశాంతి. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈమె.. చాలా కాలం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. అప్పట్లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ చక్కని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంటరైన విజయశాంతి.. 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

ప్రతిష్టాత్మక చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది

ప్రతిష్టాత్మక చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది

సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఆయన వల్లే రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి

ఆయన వల్లే రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి

విజయశాంతి చివరిగా ‘నాయుడమ్మ' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇక, అనిల్ రావిపూడి తీసిన ‘రాజా ది గ్రేట్' సినిమాతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.. ఆ సమయంలో డేట్స్ లేక ఒప్పుకోలేదు. ఇప్పుడు అనిల్ మరోసారి ఆమెను సంప్రదించడంతో ఈ సినిమాలో నటించడానికి విజయశాంతి ఒప్పుకున్నారు.

మహేశ్ తర్వాత విజయశాంతికే ప్రాధాన్యం

మహేశ్ తర్వాత విజయశాంతికే ప్రాధాన్యం

దాదాపు పదమూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు విజయశాంతి. దీంతో ఆమె కమ్‌బ్యాక్ మూవీ పక్కాగా ఉండాలని దర్శకుడికి ముందే చెప్పారట. ఇందులో భాగంగానే అనిల్ రావిపూడి ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. మహేశ్ తర్వాత అంత బాగా ఎఫెక్ట్ చూపించే పాత్రలో ఆమె కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఆమె ఎంతో స్పెషల్.. అందుకే ఇలా

ఆమె ఎంతో స్పెషల్.. అందుకే ఇలా

విజయశాంతి ఈ సినిమాలో చాలా హుందాగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లో ఆమె లుక్‌కు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లో ఆమె చెప్పిన డైలాగ్‌కు భారీ రెస్పాన్ కనిపించింది. అంతేకాదు, ఇందులో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. దీంతో తాను ఎంత స్పెషల్ అనేది నిరూపించుకున్నారు.

సరిలేరు నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సరిలేరు నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఈ సినిమాను చేసేందుకు ముందు విజయశాంతిని అనిల్ రావిపూడి పలుమార్లు సంప్రదించారని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఎన్నో చర్చల తర్వాత ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకున్నారని అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించేందుకు గానూ విజయశాంతికి రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట.

రష్మిక మందన్నా కంటే ఆమెకే అడ్వాంటేజ్.!

రష్మిక మందన్నా కంటే ఆమెకే అడ్వాంటేజ్.!


‘సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. దీని బట్టి చూసుకుంటే ఇప్పడు హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక కంటే.. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X