Satyabhama first Glimpse Review పవర్‌ఫుల్‌గా పోలీస్ ఆఫీసర్‌ సత్యభామ.. మీరు లేనిదే నేను లేనంటూ కాజల్ ఎమోషనల్

అందాల భామ కాజల్ అగర్వాల్ కెరీర్‌‌లో 60వ చిత్రంగా తెరకెక్కిన #Kajal60 సినిమాకు సత్యభామ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు గూఢచారి, మేజర్ సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ డేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను కాజల్ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేశారు. సత్యభామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంది? కాజల్ అగర్వాల్ ఏం మాట్లాడిందనే వివరాల్లోకి వెళితే..

సత్యభామ ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇద్దరు నిందితులను నిజం చెప్పించడానికి పోలీసులు లాకప్‌లో చితకబాదుతుంటారు. కానీ నిజం వారి నోటి నుంచి బయటకు రప్పించడంలో పోలీసులు విఫలమవుతారు. ఆ సమయంలో సత్యభామ పోలీస్ ఆఫీసర్ చేతికి గాజులు వేసుకొని ఎంట్రీ ఇస్తుంది.. లాకప్‌లో ఇద్దరు నిందితులను చేతితోనే చితక బాదుతుంది. దాంతో వాళ్లు నిజం చెబుతారు. అయితే కొట్టడంతో చేతికి ఉన్న గాజులు కుచ్చుకొని చిన్న గాయమై రక్తం కారుతుంటుంది.

నిందితులు చెప్పిన నిజాలను రిపోర్టుగా రాసి ఇవ్వడంతో సత్యభామ దానిపై సంతకం పెడుతుంది. అయితే గాయమైన చేతిని చూసి కానిస్టేబుల్.. గాజులు లేకుండా కొట్టాల్సింది మేడమ్ అంటే.. లేకుండా కొట్టాడుగా.. చెప్పాడా? అని చేతికి గుచ్చుకొన్న గాజును తీసేసి పవర్‌ఫుల్ లుక్ ఇస్తుంది. సత్యభామ ఫస్ట్ గ్లింప్స్ సూపర్‌గా ఆకట్టుకొన్నది. కాజల్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ సరికొత్తగా ఉంది. ఫస్ట్ గ్లింప్స్ సినిమా సూపర్ హిట్ అనే రేంజ్‌ను చూపించింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన తడాఖాను చూపించింది.

kajal-aggarwal

సత్యభామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత మాట్లాడుతూ.. సత్యభామ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌కు వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది నా బర్త్ డేను చాలా స్పెషల్‌గా చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈవెంట్‌లో మాట్లాడటానికి చాలా పాయింట్స్ రాసుకొని వచ్చాను. కానీ వాటిని పక్కన పెట్టి నా మనసుకు నచ్చినట్టు మాట్లాడుతాను.నేను రాసుకొని వచ్చిన నోట్స్ అవసరం లేదనిపిస్తుంది అని కాజల్ అగర్వాల్ అన్నారు.

kajal-aggarwal

సత్యభామ ఫస్ట్ గ్లింప్స్‌ను నా బర్త్ డే కానుకగా ఇచ్చిన టీమ్‌కు బిగ్ థ్యాంక్స్. నిజంగా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన దర్శకులు శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు. మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. మీ సినిమాల్లో హీరోయిన్లను చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. వారి క్యారెక్టర్లు వండర్‌ఫుల్‌గా ఉంటాయి. మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం అని కాజల్ అగర్వాల్ అన్నారు.

సత్యభామ ఫస్ట్ గ్లింప్స్‌ను అద్బుతంగా డిజైన్ చేసినందుకు శశికిరణ్ తిక్క, దర్శకుడు అఖిల్, చిత్రయూనిట్‌గా థ్యాంక్స్. థ్యాంక్స్ మై ఫ్యాన్స్. థ్యాంక్యూ మీడియా. మీరు లేకుండా నేను లేను. తెలుగు సినిమా పరిశ్రమ నాకు సొంత ఇంటిలాంటింది. తెలుగు ఆడియెన్స్ చాలా బెస్ట్. మీరు చూపించిన ఆదరణ, ప్రేమ, అభిమానం వల్లే ఇక్కడ నేను ఉన్నానని నమ్ముతాను అని కాజల్ అగర్వాల్ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X